అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal Mandal | మండలంలోని చేంగల్ గ్రామంలో (Chengal village) పలు బాధిత కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర కో–ఆపరేటివ్ యూనియన్ సంస్థ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy) గురువారం పరామర్శించారు. కమ్మర్‌పల్లి ఏఎంసీ డైరెక్టర్ జీవన్ తాత పెద్ద గంగారాం ఇటీవల మృతిచెందగా, ఈ మేరకు వారి కుటుంబాన్ని పరామర్శించి, సానుభూతి తెలిపారు.
అలాగే కాంగ్రెస్ కార్యకర్త తూర్పు శ్రీధర్ తండ్రి నడిపి గంగారాం మృతిచెందగా.. వారి కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ సర్పంచ్ కట్కం చిన్నారెడ్డి పెద్ద కొడుకు వంశీరెడ్డి మృతిచెందడంతో వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన వెంట మండల అధ్యక్షుడు బొదిరే స్వామి, మాజీ ఎంపీపీ సురేందర్, పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, భోజగౌడ్, గోపి, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్రబాబు, బాల్కొండ అధ్యక్షుడు చరణ్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు రాజు, దుమాల రాజు, నూతుల రమేష్, నల్లూరి శ్రీను, శ్యామ్ రాజ్, దొనకంటి రాజేష్, రవి, తదితరులున్నారు.