అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. సెలవు రోజులు, పర్వదినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. త్వరలో వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) నేపథ్యంలో పది రోజుల పాటు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమలలో డిసెంబర్ 23 నుంచి 2026 జనవరి నెలాఖరు వరకు పలు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 23, డిసెంబర్ 29, నుంచి జనవరి 8, జనవరి 25 తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు (VIP Break Darshans) రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Tirumala | పర్వదినాల నేపథ్యంలో..
డిసెంబరు 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) నిర్వహించనున్నారు. దీంతో ఆ రోజు బ్రేక్ దర్శనాలు నిలిపివేశారు. వైకుంఠ ఏకాదశి సందర్బంగా డిసెంబరు 29 నుంచి జనవరి 8 వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవని అధికారులు తెలిపారు. జనవరి 25వ తేదీన రథసప్తమి ఉంది. దీంతో ఆ రోజున ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయా రోజుల్లో సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.
