HomeUncategorizedVijay Devarakonda-Rashmika | ఒకే కారులో ప‌క్కప‌క్క‌న విజ‌య్, రష్మిక‌.. వారి రిలేష‌న్ గురించి ఇంకా...

Vijay Devarakonda-Rashmika | ఒకే కారులో ప‌క్కప‌క్క‌న విజ‌య్, రష్మిక‌.. వారి రిలేష‌న్ గురించి ఇంకా ప్ర‌త్యేకంగా చెప్పాలా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vijay Devarakonda-Rashmika | సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య ప్రేమలు, ఎఫైర్లు, పెళ్లిళ్లు ఎప్ప‌టి నుండో మ‌నం చూస్తూనే ఉన్నాం. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఎందరో నటీనటులు ప్రేమలో పడ్డారు. పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రస్తుతం తరంలోనూ ఎందరో స్టార్స్ తమ సహ నటులతో ప్రేమలో పడుతున్నారు. అలా విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక(Vijay Deverakonda-Rashmika) ప్రేమ‌లో ప‌డ్డ‌ట్టు కొన్నాళ్ల నుండి వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ప‌రశురాం దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం (Geetha Govindam) సినిమాలో తొలిసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత ఇద్దరూ కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నాటి నుంచి విజయ్ – రష్మికలు క్లోజ్ ఫ్రెండ్స్‌ అయిపోయారు.

Vijay Devarakonda-Rashmika | కెమెరాల‌కు దొరికారు..

వీరి కాంబోలో తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్(Dear Comrade) డిజాస్టర్‌గా నిలిచింది. అయినా వారి రిలేష‌న్‌కు ఎలాంటి బ్రేక్ లేదు. గత కొన్నేళ్లు ఈ ఇద్దరి గురించి మీడియాలో, సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్. విజయ్‌తో రష్మిక పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోందని చిత్రసీమలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు వీరిద్దరూ కలిసి పబ్లిక్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని.. వెకేషన్స్‌కు సీక్రెట్‌గా వెళ్తున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. మాల్దీవుల టూర్‌తో పాటు ఎయిర్‌పోర్టులు, రెస్టారెంట్స్‌లలో విజయ్ దేవరకొండ- రష్మికలు ఉన్న ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొట్ట‌డంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.

తాజాగా.. ఈ జంట ముంబై విమానాశ్రయం(Mumbai Airport)లో కలిసి కనిపించడం సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక ప్రయాణిస్తున్న కారులోనే విజయ్ దేవరకొండ కూర్చుని కనిపించారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు ఫోటోగ్రాఫర్‌లు తమ కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో విజయ్, రష్మిక నిజంగానే ప్రేమలో ఉన్నారనే చర్చ మళ్లీ జోరందుకుంది. దీని గురించి ప్ర‌త్యేకంగా డిస్క‌స్ చేయాల్సిన ప‌నిలేదు. వారు రిలేష‌న్‌లో ఉన్నారు. త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తార‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.