Homeక్రైంwomen protection | స్నానం చేస్తుండగా వీడియో.. మహిళ చూడటంతో..

women protection | స్నానం చేస్తుండగా వీడియో.. మహిళ చూడటంతో..

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: women protection : మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకొంటున్నా వారికి రక్షణ లేకుండా పోతోంది. ఇంటా, బయట అతివ ఏదో ఒక సందర్భంలో వేధింపులకు గురవుతోంది. అత్యాచార వేధింపులు, వికృత చేష్టలతో విసుగుపోతోంది.

తాజాగా హైదరాబాద్​ లో hyderabad city ఓ మహిళ స్నానం చేస్తుండగా మొబైల్​లో రహస్యంగా వీడియో తీసిన ఘటన వెలుగుచూసింది. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. జీహెచ్​ఎంసీ GHMC hyderabad పరిధి మధురానగర్ కమ్యూనిటీ హాలులో పనిచేసే ఓ మహిళ సోమవారం(ఏప్రిల్ 21) ఉదయం బాత్​రూమ్​లో స్నానం చేస్తున్నారు. అదే సమయంలో గుంటూరుకు చెందిన మరియకుమార్(23 ) మధురానగర్ కమ్యూనిటీ హాలుకు వచ్చాడు. ఎలక్ట్రికల్ వర్క్ చేసుకునే ఈ యువకుడు బోరబండలో ఉంటాడు.

మధురానగర్ కమ్యూనిటీ హాలులో ఎలక్ట్రికల్ పని చేసేందుకు వచ్చిన మరియకుమార్.. బాత్​రూమ్​లో మహిళ స్నానం చేయడాన్ని గమనించి, తన జేబులో నుంచి మొబైల్​ను తీసి దొంగచాటుగా వీడియోను చిత్రీకరించడం మొదలుపెట్టాడు. ఇంతలోనే అతను వీడియో తీయడం బాధిత మహిళ గమనించి గట్టిగా కేకలు వేశారు. దీంతో ఆ కీచక యువకుడు పారిపోయాడు.

కేకలు విన్న ఆ యువకుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. బాధిత మహిళ మధురానగర్ పోలీస్ స్టేషన్​కి madhuranagar police station వెళ్లి ఫిర్యాదు చేయడంతో, పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందుతుడిని అరెస్టు చేశారు.