Vijayanagaram | ట్యూష‌న్‌కి వ‌చ్చిన ఎనిమిదేళ్ల‌ బాలిక‌పై మాస్టార్ అత్యాచార య‌త్నం.. సాహ‌సం చేసి త‌ప్పించుకున్న బాలిక

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vizianagaram | మానవత్వాన్ని మంటగలిపే ఘటన విజయనగరం జిల్లాలో (Vijayanagaram district) చోటు చేసుకుంది. గ్రామంలో పిల్లలకు ట్యూషన్ చెప్పే మాస్టారు (Tuition Master) మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఈ దారుణ సంఘటన భోగాపురం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, బూర్ల విజయ్ కుమార్ (Vijay Kumar) అనే వ్యక్తి తన ఇంటి వద్ద మరో మహిళతో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vizianagaram | మానవత్వాన్ని మంటగలిపే ఘటన విజయనగరం జిల్లాలో (Vijayanagaram district) చోటు చేసుకుంది. గ్రామంలో పిల్లలకు ట్యూషన్ చెప్పే మాస్టారు (Tuition Master) మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఈ దారుణ సంఘటన భోగాపురం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, బూర్ల విజయ్ కుమార్ (Vijay Kumar) అనే వ్యక్తి తన ఇంటి వద్ద మరో మహిళతో కలిసి పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడు. శనివారం రోజున ఆయన తోటి ఉపాధ్యాయురాలు అనారోగ్యం కారణంగా రాకపోవడంతో, తను ఒక్కడే క్లాస్‌లు నిర్వహించాడు. ఇదే అదునుగా తీసుకున్న తాను మూడో తరగతి చదువుతున్న ఓ బాలికను గదిలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు.

Vijayanagaram | మ‌నిషేనా?

అయితే దేవుడి దయతో అదే సమయంలో ఎవరో ఇంటికి వచ్చారు. వారి రాకతో విజ‌య్ కుమార్ తన నీచ చర్యను కొనసాగించలేకపోయాడు. దాంతో బాలిక గదిలో నుంచి తప్పించుకుని నేరుగా ఇంటికి వెళ్లిపోయింది. భయంతో వణికిపోయిన బాలిక జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు (Parents) వివరించింది. ఈ విషయాన్ని విన్న వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సోమవారం సాయంత్రం, విషయం గ్రామస్థులకు తెలియడంతో వారు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. విజయ్ కుమార్‌ను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు (police registered Case) చేశారు. ప్రస్తుతం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడిపై పోక్సో చట్టం (Pocso ACT) కింద కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ‌స్థులు కోరారు. విజయ్ కుమార్‌పై గతంలోనూ ఇలాంటి ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని గ్రామస్థులు తెలిపారు. కానీ పక్కా సమాచారం లేకపోవడంతో ఎవరు బయటపెట్టలేకపోయారని చెప్పారు. ఇప్పుడు ఈ సంఘటన వెలుగులోకి రావడంతో, అతడి గతాన్ని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ సంఘటన తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ఎంత నిఘా పెట్టాలో గుర్తు చేస్తోంది. ఎవరి ఇంట్లో, ఎవరితో పిల్లలు ఉన్నారు? వారు ఎలా బిహేవ్ చేస్తున్నారు? అని గమనించడం తప్పనిసరి. పిల్లల నడవడికలు, భావప్రకటనలు మారితే వెంటనే స్పందించాలి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...