అక్షరటుడే ఇందూరు : RTA Rules | ప్రతి వాహనదారులు నిబంధనలను పాటిస్తూ నడపాలని జిల్లా రవాణా శాఖ (Transport Department) అధికారి ఉమామహేశ్వరరావు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) తెలిపారు. నగరంలోని వినాయకనగర్‌లో శుక్రవారం రహదారి భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
RTA Rules | బైక్‌పై వెళ్లేటప్పుడు హెల్మెంట్ ధరించాలి..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపరాదన్నారు. ప్రతి విద్యార్థి ఇతరులకు అవగాహన కల్పించాలని సూచించారు. సుమారు 500 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రుక్మిణి చాంబర్స్ చౌరస్తాలో (Rukmini Chambers Chowrastha) ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంవీఐ కిరణ్ కుమార్, ఏఎంవీఐ శృతి, ఆర్టీఏ సభ్యులు రాజా నరేందర్ గౌడ్, ఈడార్ మేనేజర్ వర్ష తదితరులు పాల్గొన్నారు.