అక్షరటుడే, వెబ్డెస్క్ : Vehicle Registration | కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారికి రవాణా శాఖ (Transport Department) గుడ్ న్యూస్ చెప్పింది. వాహన రిజిస్ట్రేషన్లలో నూతన విధానం తీసుకొచ్చింది. ఈ విధానం శనివారం (నేటి) నుంచి అమలులోకి వచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా బైక్, కారు షోరూమ్ల్లోనే (Car Showrooms) ఇక నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ చేయనున్నారు. దీని కోసం గతంలో ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేంది. అక్కడ గంటల తరబడి లైన్లో నిలిచి ఉండి ఫొటో దిగి, సైన్ చేసిన తర్వాత.. అధికారులు వచ్చి వాహనాన్ని తనిఖీ చేసేవారు. వారు ఒకే అంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేది. దీని కోసం ఆర్టీఏ కార్యాలయాల్లో (RTA Offices) పలువురు ఏజెంట్లు ఉండేవారు. వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయించేవారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం (State Government) వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.
Vehicle Registration | సమయం ఆదా
కొత్త విధానంతో వాహనదారుల సమయం ఆదా కానుంది. ఎక్కడైతే బండి కొన్నామో అక్కడే రిజిస్ట్రేషన్ చేయనున్నారు. వాహన రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాలు.. ఇన్వాయిస్, ఫారం-21, ఫారం-22, బీమా, అడ్రస్ ప్రూఫ్, వాహన ఫొటోలు మొదలైనవి డీలర్ నేరుగా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. రవాణా శాఖ అధికారులు వాటిని పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబరు కేటాయిస్తారు. అనంతరం ఆర్సీ స్పీడ్ పోస్టులో వాహన యజమాని (Vehicle Owner) ఇంటికి వెళ్తుంది. అయితే ఈ విధానం కార్లు, బైక్లకు మాత్రమే వర్తించనుంది. వాణిజ్య వాహనాలు, భారీ వాహనాలు కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీవో కార్యాలయాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. నూతన విధానం అమలు ప్రక్రియపై రవాణాశాఖ ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు అవగాహన కల్పించింది. శుక్రవారం హైదరాబాద్లో ఓ వాహనాన్ని ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్ చేసి చూశారు. అది విజయవంతం కావడంతో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.