అక్షరటుడే, బాల్కొండ : Balkonda | స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో (Local Body Elections) బాల్కొండలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేపడుతున్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ (Zilla Parishad High School) రహదారిపై బుధవారం ఎన్నికల అధికారుల బృందం పలు వాహనాలను తనిఖీ చేసింది.
Balkonda | శాంతియుతంగా నిష్పక్షపాతంగా..
ఎన్నికలను శాంతియుతంగా.. నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తనిఖీలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. తమవెంట నగదు తీసుకెళ్లే విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. రూ.50వేలకు పైగా నగదును సరైన అధారాలు లేకుండా తరలిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. తమ అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించవద్దని పేర్కొన్నారు.
