అక్షరటుడే, బాల్కొండ: Balkonda | వీడీసీ సభ్యులు (VDC members) కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చిట్టాపూర్ గ్రామానికి చెందిన పులిశెట్టి లింగన్న ఆవేదన చెందుతున్నాడు. ఈ మేరకు బాల్కొండ పోలీస్స్టేషన్ (Balkonda police station) ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్టాపూర్ గ్రామానికి చెందిన పులిశెట్టి లింగన్నపై గ్రామ వీడీసీ సభ్యులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ బాల్కొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Balkonda | బెదిరింపులకు పాల్పడ్డారు..
దీనిపై ఆగ్రహించిన కొందరు వీడీసీ సభ్యులు తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లినందుకు రూ.50వేల జరిమానా విధిస్తున్నామని తెలిపారన్నారు. అలాగే ఒక్కో వీడీసీ సభ్యుడికి చొప్పున 17 మందికి ఒక్కొక్కరికి రూ.4,000 చెల్లించాలని హుకుం జారీ చేశారని లింగన్న ఆరోపించారు. డబ్బులు చెల్లించకపోతే సోషల్ బైకాట్ చేస్తామని బెదిరించారని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.