Kotagiri | వీడీసీ ఆగడాలను అరికట్టాలి..

అక్షర టుడే, కోటగిరి : Kotagiri | ఆర్మూర్‌ ప్రాంతంలో రోజురోజుకు వీడీసీల ఆగడాలు మితిమీరుతున్నాయని తెలంగాణ రాష్ట్ర గీత కార్మిక సంఘం నాయకులు (Geetha Karmika Sangam leaders) ఆరోపించారు. ఈ మేరకు కోటగిరి మండలకేంద్రంలో (Kotagiri Mandal Center) ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర కార్యదర్శి విఠల్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. మూడు రోజుల కిందట ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌లో వీడీసీ సభ్యులు గీత కార్మికులపై దాడి చేశారని, వీరి ఆగడాలను అరికట్టాలని డిమాండ్‌ […]

అక్షర టుడే, కోటగిరి : Kotagiri | ఆర్మూర్‌ ప్రాంతంలో రోజురోజుకు వీడీసీల ఆగడాలు మితిమీరుతున్నాయని తెలంగాణ రాష్ట్ర గీత కార్మిక సంఘం నాయకులు (Geetha Karmika Sangam leaders) ఆరోపించారు. ఈ మేరకు కోటగిరి మండలకేంద్రంలో (Kotagiri Mandal Center) ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర కార్యదర్శి విఠల్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. మూడు రోజుల కిందట ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌లో వీడీసీ సభ్యులు గీత కార్మికులపై దాడి చేశారని, వీరి ఆగడాలను అరికట్టాలని డిమాండ్‌ చేశారు.

అంతేగాకుండా కుల వృత్తిదారులపై దాడులు చేసేవారిపై పీడీ యాక్ట్​ అమలు చేయాలన్నారు. కొంతమంది రాజకీయ పెత్తందార్ల అవసరం కోసం కుల వృత్తులను వాడుకుంటున్నారని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా అరికట్టాలని కోరారు. ఈ విషయంపై ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్ (Mahesh Kumar Goud), ఎంపీ అర్వింద్‌ (MP Arvind) స్పందించాలన్నారు. కార్యక్రమంలో గీత కార్మిక సంఘం మండల నాయకులు బి వెంకట్‌ గౌడ్, ఎం శ్రీధర్‌ గౌడ్, రాజా గౌడ్, కోటగిరి గీతా కార్మికులు కృష్ణ గౌడ్, ప్రకాష్‌ గౌడ్, సాయికృష్ణ గౌడ్, గంగాప్రసాద్‌ గౌడ్, ఎం సాయికుమార్‌ గౌడ్త దితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...