అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vastu and Astrology hacks | చదువులో రాణించాలంటే కేవలం పుస్తకాలతో కుస్తీ పడితే సరిపోదు, సరైన వాతావరణం కూడా ఉండాలి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు పడుతున్న ఒత్తిడిని తగ్గించి, వారి మేధస్సును పదును పెట్టడంలో వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలు అద్భుతంగా పని చేస్తాయి. ముఖ్యంగా కూర్చునే ‘దిశ’ మీ భవిష్యత్తును మారుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Vastu and Astrology hacks | జ్ఞాపకశక్తిని పెంచే దిశలు:
ఉత్తర దిశ (North): ఈ దిశకు బుధుడు అధిపతి. తెలివితేటలు పెరగాలన్నా, చదివిన విషయాలు గుర్తుండాలన్నా ఉత్తరం వైపు ముఖం పెట్టి చదవడం చాలా మంచిది. పరీక్షల సమయంలో భయం వేసినా, మైండ్ బ్లాంక్ అయినట్లు అనిపించినా ఈ దిశలో కూర్చోవడం వల్ల ప్రశాంతత లభిస్తుంది.
తూర్పు దిశ (East): సూర్యుడు ఈ దిశకు అధిపతి కాబట్టి, ఇటువైపు ముఖం పెట్టి చదివితే ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరుగుతాయి. ముఖ్యంగా కొత్త విషయాలను నేర్చుకునేటప్పుడు తూర్పు దిశ ఎంతో మేలు చేస్తుంది.
పశ్చిమ దిశ (West): ఈ దిశకు శని దేవుడు అధిపతి. ఇది పట్టుదలను, స్థిరత్వాన్ని ఇస్తుంది. అయితే, పశ్చిమ దిశలో కూర్చున్నప్పటికీ ముఖం మాత్రం ఉత్తరం / తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈశాన్యం (North-East): ఈ దిశకు గురువు అధిపతి. జ్ఞానం కోసం, ఉన్నత విద్య కోసం ఈ దిశలో కూర్చుని చదవడం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరం.
ముఖ్యమైన చిట్కాలు:
పరీక్షల ఒత్తిడి: పరీక్షా హాలులో మతిమరుపు రాకుండా ఉండాలంటే రోజువారీ అభ్యాసంలో ఉత్తర దిశను ఎంచుకోండి.
ఆధ్యాత్మిక తోడ్పాటు: ఏకాగ్రత పెరగడానికి, ప్రతికూల ఆలోచనలు దరిచేరకూడదంటే.. ప్రతి మంగళవారం ‘ప్రజ్ఞావర్థన స్తోత్రం’ పఠించడం మంచిది.
ఈ వాస్తు నియమాలు పాటించడం వల్ల విద్యార్థులు తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని గ్రహించగలరు. ఒత్తిడిని అధిగమించి పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించగలరు.