అక్షరటుడే, భిక్కనూరు: Bhiknoor | మండల కేంద్రంలోని సిద్దరామేశ్వర ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రంలోని వాసవీ మాత ఆలయంలో (Vasavi Mata temple) మంగళవారం కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ వారికీ పంచామృతాభిషేకం అర్చనలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. వాసవి చాలీసా, లలితాదేవి సహస్ర నామావళి, లలితాదేవి స్తోత్రాలను పఠించారు.
Bhiknoor | భక్తులకు అన్నప్రసాద వితరణ
ఈ సందర్బంగా భక్తులకు అన్నప్రసాదాన్ని (Annaprasadam) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సత్రం కోశాధికారి చికోటి వెంకటేశం, ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు పురం రాజమౌళి, సత్రం సభ్యులు పబ్బ నాగరాజు, కోడిప్యాక ఆంజనేయులు, శెనిశెట్టి రాజలింగం, శెనిశెట్టి శ్రీనివాస్, ప్రతినిధులు కొడిప్యాక వెంకటేశం, చంద్రమౌళి, నాగర్జున, ఆగమయ్య తదితరులు పాల్గొన్నారు.