62
అక్షరటుడే,ఆర్మూర్: Vasantha Panchami | పట్టణంలోని శాస్త్రి నగర్ కాలనీ (Shastri Nagar Colony)లోని సరస్వతి మాత ఆలయం (Saraswati Mata Temple)లో శుక్రవారం వసంత పంచమని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో యజ్ఞం నిర్వహించి, చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.

Vasantha Panchami | పూజలు చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
సరస్వతి శిశుమందిర్‌లో వసంత పంచమి వేడుకల్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) పాల్గొని సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ తల్లి కటాక్షంగా విద్యార్థులంతా మంచిజ్ఞానం రావాలని.. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.
