Homeఆంధప్రదేశ్Prakasam district | పెళ్లిలో అమ్మాయిని అబ్బాయిగా మార్చారు, అబ్బాయిని అమ్మాయిగా మార్చారు.. వింత పెళ్లి

Prakasam district | పెళ్లిలో అమ్మాయిని అబ్బాయిగా మార్చారు, అబ్బాయిని అమ్మాయిగా మార్చారు.. వింత పెళ్లి

తరతరాలుగా వస్తున్న బత్తుల వంశ సంప్రదాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలం ఎంత మారినా తమ ఆచారాలను, సంస్కృతిని జాగ్రత్తగా కాపాడుతున్న కుటుంబం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Prakasam district | భారతదేశంలో పెళ్లిళ్లు (Marriages) అంటే పూలు, పాన్పులు, పందిళ్లు, సంగీతం.. ఇలా ప్రతి ప్రాంతం, ప్రతి వంశానికి కొన్ని సంప్రదాయాలు ఉంటాయి.

వాటిలో కొన్ని సాధారణంగా ఉండగా, మరికొన్ని వింతగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. అలాంటి ఒక విచిత్రమైన, అరుదైన పెళ్లి ఆచారం ఇటీవల ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం (Yerragondapalem mandal) కొలుకుల గ్రామంలోని బత్తుల వంశంలో జరిగింది. ఈ ఆచారం ఇప్పుడు సోషల్ మీడియా అంతటా చర్చనీయాంశమైంది.

Prakasam district | వధువు వరుడిలా… వరుడు వధువులా!

బత్తుల కుటుంబంలో (Battula Family) ఎవరి ఇంట పెళ్లి జరిగినా, వధువు-వరుడు వారి వేషధారణలను మార్చుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న ప్రత్యేక సంప్రదాయం. అదే ఆచారాన్ని శివ గంగు రాజు – నందిని వివాహ వేడుకలో కూడా పాటించారు. వరుడు శివ గంగు రాజును ఈ సందర్భంగా పట్టుచీర, పట్టుజాకెట్, వడ్డాణం, అరవంకి, బంగారు ఆభరణాలు వేసి కొత్త వధువులా అలంకరించారు. అతన్ని చూసి మహిళలు నోరెళ్ల‌పెట్టారు. వధువు నందిని మాత్రం తెల్ల షర్టు, తెల్ల ప్యాంటు, తలపై పాగా ధరించి వధువు కాదు, కొత్త వరుడిలా కనిపించింది.ఇలా వేషధారణ మార్చుకున్న తర్వాత వీరిని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లి, కులదైవం ముందు ప్రత్యేక పూజలు చేశారు.

బత్తుల వంశానికి ఇది శతాబ్దాల నాటి ఆచారం. వారి కులదైవాన్ని ప్రసన్నం చేయడానికి, వంశ రక్షణ కోసం ఈ సంప్రదాయం పాటిస్తారని పెద్దలు చెబుతున్నారు.ఈ సందర్భంగా కుటుంబ పెద్దలు మాట్లాడుతూ.. “కాలాలు మారినా, మేము చదువులు చదివి పెద్ద పోస్టుల్లో ఉన్నప్పటికీ మా సంప్రదాయాన్ని మాత్రం వదలము. “వధువు-వరుడు వేషధారణ మార్చుకోవడం మా వంశానికి శుభ సూచకం”, “ఎవరి ఇంట పెళ్లి జరిగినా ఇదే విధంగా ఆచారం చేస్తాం” అని తెలిపారు.వధువు-వరుడు వేషాలు మార్చుకుని బాజాలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామంలో Village తిరుగుతుండగా చిన్నా పెద్దా అందరూ వీరిని చూసేందుకు భారీగా చేరారు. ఇది గ్రామంలో పండుగ వాతావరణాన్ని సృష్టించింది.

Must Read
Related News