అక్షరటుడే, వెబ్డెస్క్: Vizianagaram | సాధారణంగా దొంగలు చోరీకి పాల్పడాలనుకుంటే.. ఏదైనా ఇంటిని టార్గెట్ చేసి పక్కా స్కెచ్ వేస్తారు.. ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో చొరబడి డబ్బులు, బంగారం, విలువైన వస్తువుల్ని తీసుకుని పరారవుతారు. చాలా మంది దొంగలు పోలీసులకు (police) చిక్కకుండా దొంగతనాలకు పాల్పడుతుంటారు. కొందరు పోలీసులకు దొరికిపోతారు. కానీ ఈ దొంగ (Thief) మాత్రం అలా కాదండోయ్.. కాస్త డిఫరెంట్.
Vizianagaram | అసలేంటి విషయం అనుకుంటున్నారా..
ఈ వెరైటీ దొంగ ఓ ఇంట్లో చోరీ చేసి సొత్తు ఎత్తుకెళ్లాడు.. వాటిని అమ్ముకుని వచ్చిన డబ్బులతో ఫుల్‌గా మందేశాడు. అంతటితో ఊరుకున్నాడా.. మళ్లీ చోరీ చేసిన ఇంటికే వచ్చి ఎంచక్కా నిద్రపోయాడు.. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతని పట్టుకున్నారు. ఇదంతా వింతగా ఉంది కదూ.. ఇది నిజమేనండోయో.. విజయనగరం జిల్లా (Vizianagaram district) బొబ్బిలిలో జరిగింది ఈ ఘటన.
Vizianagaram | అసలేం జరిగిందంటే..
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ (Bobbili town) పరిధిలోని గొల్లపల్లి అంబేద్కర్ కాలనీకి చెందిన శ్రీనివాసరావు తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. శ్రీనివాసరావు కుటుంబం మూడు రోజుల క్రితం సొంత ఊరికి వెళ్లింది. కాగా.. తాగుడుకు బానిసైన కృష్ణ అనే వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అయితే శ్రీనివాసరావు ఇంటి తాళం ఉండడానికి గమనించిన దొంగ లోపలికి చొరబడ్డాడు. బీరువాలో ఉన్న వస్తువులను చిందరవందర చేశాడు. అక్కడ దొరికిన వెండి, ఇత్తడి వస్తువులను ఎత్తుకెళ్లాడు.. వాటిని అమ్మేయగా వచ్చిన డబ్బుతో ఫుల్లుగా మందు తాగాడు. ఆ మత్తులో మళ్లీ చోరీ చేసిన ఇంటికే వెళ్లి నిద్రపోయాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా.. ఈ వెరైటీ దొంగ ఫుల్లు నిద్రలో ఉన్నాడు. అనంతరం పోలీసులు అతడిని పట్టుకుని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు (Case registered) చేసుకుని దర్యాప్తు (investigation) చేస్తున్నారు.