Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Collector | రేపు వందేమాతరం సామూహిక గీతాలాపన

Nizamabad Collector | రేపు వందేమాతరం సామూహిక గీతాలాపన

వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం వందేమాతరం ఆలపించాలని ఆదేశించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో (Nizamabad Collectorate) ఉదయం 10 గంటలకు సామూహిక గీతాలాపన ఉంటుందని పేర్కొన్నారు.

కలెక్టరేట్ సహా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వందేమాతరం (Vande Mataram) గీతం ఆలపించాలని ఆదేశించారు. మహాకవి బంకిం చంద్ర చటర్జీ ‘వందేమాతరం’ గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని మరింతగా పెంపొందించేందుకు, దేశ చరిత్రలో వందేమాతరం గీతానికి గల ప్రాధాన్యతను చాటి చెప్పడానికి గీతాలాపన చేయనున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో కూడా వందేమాతరం ఆలపించాలని ఆదేశించారు.