- Advertisement -
HomeUncategorizedVan hits bike | బైక్​ను ఢీకొట్టి బావిలో పడ్డ వ్యాన్​.. 11 మంది దుర్మరణం

Van hits bike | బైక్​ను ఢీకొట్టి బావిలో పడ్డ వ్యాన్​.. 11 మంది దుర్మరణం

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Van hits bike : మధ్యప్రదేశ్‌లోని మంద్​సౌర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకెళ్తున్న వ్యాన్.. ఒక బైక్‌ను ఢీకొట్టి, అదుపు తప్పి బావిలో పడిపోయింది. నారాయణ్ ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కచారియా గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తితో పాటు బావిలో పడ్డ వారిని రెస్క్యూ చేయబోయిన వ్యక్తి సైతం మరణించారు.

రత్లాం రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) మనోజ్ సింగ్ కథనం ప్రకారం.. రత్లాం జిల్లా తాల్‌కు చెందిన 13 మంది మంద్ సౌర్ జిల్లా అంతారి మాతాజీ గ్రామంలో ఉన్న మాతా ఆలయం సందర్శనకు వ్యాన్‌లో వెళ్తుండగా.. కచారియా చౌపట్టి వద్దకు చేరుకోగానే డ్రైవరు అదుపు కోల్పోయాడు. దీంతో వాహనం ఓ బైక్‌ను ఢీకొట్టి, నేరుగా వెళ్లి బావిలో పడిపోయింది.

- Advertisement -

వ్యాన్ వేగంగా ఢీకొనడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి మరణించాడు. బావిలో వ్యాన్ పడటాన్ని చూసిన స్థానికుడు మనోహర్ బావిలోకి దూకి, వ్యాన్‌లోని వారిని కాపాడేందుకు యత్నిస్తూ నీటిలో మునిగి చనిపోయాడు. మల్హర్‌గఢ్ ఎస్‌‌డీఓపీ నరేంద్ర సోలంకి, అదనపు ఎస్పీ గౌతమ్ సోలంకి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాద సమయంలో వ్యాన్‌లో మొత్తం 13 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News