Nizamabad | వైశ్య సంఘం ఎన్నికలు ప్రారంభం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | నిజామాబాద్ (Nizamabad)​ నగరంలోని వైశ్య సంఘం (Vyshya Sangam) ఎన్నికలు ఆదివారం (నేడు) నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పలువురు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సాధారణ ఎన్నికలకు మించి ప్రచారాలు చేయడం గమనార్హం. రెండు ప్యానళ్లు, నాలుగు సంఘాలకు పోటీ పడుతున్నాయి. గతంలో వైశ్య యువజన సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. పట్టణ సంఘంతో పాటు మూడు అనుబంధ సంఘాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. Nizamabad | ప్రారంభమైన ఓటింగ్​ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | నిజామాబాద్ (Nizamabad)​ నగరంలోని వైశ్య సంఘం (Vyshya Sangam) ఎన్నికలు ఆదివారం (నేడు) నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పలువురు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సాధారణ ఎన్నికలకు మించి ప్రచారాలు చేయడం గమనార్హం. రెండు ప్యానళ్లు, నాలుగు సంఘాలకు పోటీ పడుతున్నాయి. గతంలో వైశ్య యువజన సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. పట్టణ సంఘంతో పాటు మూడు అనుబంధ సంఘాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

Nizamabad | ప్రారంభమైన ఓటింగ్​

పట్టణ వైశ్యసంఘంతో పాటు శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల (Manik Bhavan),  పట్టణ ఆర్యవైశ్య భవన్  (కల్యాణ మండపం) పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మాణిక్ భవన్ పాఠశాలలో ఉదయం 8 గంటలకు ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్​ జరగనుంది. సోమవారం కన్యకాపరమేశ్వరి ఆలయం (Kanyaka Parameswari Temple)లో కౌంటింగ్ నిర్వహించి విజేతలను ప్రకటించనున్నారు. కాగా నగరంలో 10,017 మంది ఓటర్లు ఉన్నారు.

Nizamabad | రసవత్తరంగా పోటీ

పట్టణ సంఘంతో పాటు అనుబంధ సంఘాల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అర్వపల్లి పురుషోత్తం గుప్తా, ధన్​పాల్ శ్రీనివాస్ గుప్తా ప్యానళ్ల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. నూతన వైశ్య ఉన్నత పాఠశాల పాలవర్గానికి గజవాడ హనుమంతురావు, ఇంగు శివప్రసాద్ పోటీ పడుతున్నారు. నగరంలోని వైశ్యభవన్ పాలకవర్గానికి ఇల్లెందుల సుధాకర్, విశ్వనాథం నారాయణ పోటీ చేస్తున్నారు. కన్యకాపరమేశ్వరి ఆలయానికిబాశెట్టి విశ్వనాథం, పాల్తి రవికుమార్ ప్యానెళ్లు పోటీలో ఉన్నాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...