Vaibhav Suryavanshi | ఐపీఎల్​లో 14 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. సీనియర్​ బౌలర్లనూ ఉతికారేసిన చిన్నోడు..!
Vaibhav Suryavanshi | ఐపీఎల్​లో 14 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. సీనియర్​ బౌలర్లనూ ఉతికారేసిన చిన్నోడు..!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vaibhav Suryavanshi : వైభ‌వ్ సూర్య‌వంశీ.. కేవలం 14 ఏళ్ల కుర్రాడు.. ఐపీఎల్ లో ఎదురుగా దూసుకొచ్చిన తొలి బంతినే సిక్స‌ర్ తో బౌండరీ దాటించి, టాక్ ఆఫ్ ది క్రికెట్ అయ్యాడు. తాజాగా గుజ‌రాత్ తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్​ రాయల్స్ తరఫున ఆడుతూ 35 బంతుల్లో సెంచ‌రీ చేసి, ఒంటి చేత్తో గత క్రికెటర్ల రికార్డుల‌న్నీ తిర‌గ‌రాశాడు. వేగ‌వంత‌మైన సెంచ‌రీల్లో రెండో స్థానంలో వైభవ్​ నిలిచాడు.

ర‌షీద్ ఖాన్ లాంటి ప్ర‌పంచ స్థాయి బౌల‌ర్‌నే దడదడ లాడించాడు. వంద టెస్టులు ఆడిన అనుభ‌వం ఉన్న ఇషాంత్ శ‌ర్మ‌పై క‌నిక‌రమే చూపించ‌కుండా ఉతికి ఆరేశాడు. ప్ర‌సిద్ కృష్ణ ని కూడా ప‌ట్టించుకోలేదు.. సిరాజ్ భాయ్‌నీ వ‌ద‌ల్లేదకుండా బాదాడు. కొడితే సిక్స‌ర్‌.. లేదంటే ఫోర్ అన్న‌ట్టు సాగింది వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం.

రాజస్థాన్ రాయల్స్‌ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జైపూర్ ను మరిగించాడు. గుజరాత్ టైటాన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులోనే అద్భుతమైన శతకం చేశాడు. ఈ విజయంతో 2009లో మణీష్ పాండే నెలకొల్పిన(19 ఏళ్ల 253 రోజుల్లో శతకం) రికార్డును కూల్చేశాడు.

210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓపెనింగ్‌లో సూర్యవంశీ వచ్చాడు. తన వయసుకు మించిన పరిణితి, ధైర్యంతో బ్యాటింగ్ తో ఆదరగొట్టాడు. పవర్‌ప్లేలోనే రాజస్థాన్ రాయల్స్ 87/0 పరుగులు సాధించడంలో అతడి వేగవంతమైన బ్యాటింగ్ ప్రధానంగా నిలిచిందనే చెప్పాలి. చివరికి 101 పరుగులు (38 బంతుల్లో) చేసి, ప్రసిద్ కృష్ణ వేసిన అద్భుతమైన యార్కర్‌కు క్లీన్డ్ బౌల్డ్ అయ్యాడు.

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ రికార్డులు..

  • ఐపీఎల్ చరిత్రలో అత్యంత చిన్న వయసులో శతకం (14 ఏళ్ళ 32 రోజులు)
  • ఏకదంచైన టీ20 మ్యాచ్‌లో అత్యంత చిన్న వయసులో శతకం
  • ఐపీఎల్ 2025లో వేగవంతమైన అర్ధ శతకం (17 బంతులు)
  • ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకం (35 బంతులు)
  • ఐపీఎల్‌లో అతి చిన్న వయసులో హాఫ్ సెంచరీ
  • ఐపీఎల్ డెబ్యూట్ చేసిన అతి చిన్న వయసు క్రీడాకారుడు (14 ఏళ్ళు 32 రోజులు)
  • ఐపీఎల్‌లో అతి చిన్న వయసులో సిక్సర్ కొట్టిన క్రీడాకారుడు
  • మొదటి బంతికే సిక్సర్ కొట్టిన అతి చిన్న వయసు క్రీడాకారుడు
  • గుజరాత్ టైటాన్స్‌పై వేగవంతమైన ఫిఫ్టీ చేసిన ఆటగాడు
  • రాజస్థాన్ రాయల్స్ తరఫున రెండో వేగవంతమైన ఫిఫ్టీ చేసిన ఆటగాడు
  • రాజస్థాన్ రాయల్స్ పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు (87/0 vs GT, జైపూర్ 2025) సాధించిన ఘనత