One Big Beautiful Bill | వన్​ బిగ్​ బ్యూటీఫుల్​ బిల్లుకు అమెరికా సెనెట్​ ఆమోదం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: One Big Beautiful Bill : అమెరికా సెనెట్​లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్​ (US President Donald Trump) తాను అనుకున్న బిల్లులను చకచకా అమల్లోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో విప్లవాత్మక బిల్లుకు శ్రీకారం చుట్టారు. అక్రమ వలసదారులను వెనక్కి పంపించే ప్రోగ్రాంకు నిధులు కేటాయించేందుకు ట్రంప్ తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ (Big Beautiful Bill)కు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. 51-50 ఓట్ల తేడాతో […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: One Big Beautiful Bill : అమెరికా సెనెట్​లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్​ (US President Donald Trump) తాను అనుకున్న బిల్లులను చకచకా అమల్లోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో విప్లవాత్మక బిల్లుకు శ్రీకారం చుట్టారు. అక్రమ వలసదారులను వెనక్కి పంపించే ప్రోగ్రాంకు నిధులు కేటాయించేందుకు ట్రంప్ తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ (Big Beautiful Bill)కు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. 51-50 ఓట్ల తేడాతో ఈ బిల్లు సెనెట్​లో గట్టెక్కింది.

One Big Beautiful Bill : గట్టెక్కించిన యూఎస్​ ఉపాధ్యక్షుడు..

‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’కు సెనెట్​లో అంత త్వరగా ఆమోదం లభించలేదు. ఎందుకంటే 50-50 ఓట్లు రావడమే ఇందుకు కారణం. సరిసమానంగా ఓట్ల రావడంతో యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ US Vice President J.D. Vance టై బ్రేకర్ మారి ముందుకొచ్చారు. బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. అనంతరం సెనెట్లో బిల్లు ఆమోదం పొందిందని ఉపాధ్యక్షుడు వాన్స్ ప్రకటించారు. దీంతో రిపబ్లికన్లు సభలో లేచి చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు.

కాగా, ముగ్గురు రిపబ్లిన్ సభ్యులు సుసాన్ కొలిన్స్ (మైన్)Susan Collins (Maine), థామ్ టిల్లిస్ (నార్త్ కరోలినా) Thom Tillis (North Carolina), రాండ్ పాల్ (కెంటకీ) Rand Paul (Kentucky) మాత్రం ఈ బిల్లును వ్యతిరేకించారు. సెనెట్​లో ఆమోదం పొందిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ తదుపరి ఓటింగ్ కోసం ప్రతినిధుల సభకు పంపిస్తారు. అక్కడ మెజారిటీ సభ్యుల ఆమోదం పొందాక యూఎస్​ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వద్దకు పంపుతారు.

ఈ బిల్లులో మార్పులు చేర్పులు చేయాలనుకుంటే.. మళ్లీ సెనెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. 940 పేజీలతో కూడిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’పై సెనెట్ లో సుదీర్ఘ చర్చనే కొనసాగింది. ఈ బిల్లు చట్టంగా మారేందుకు రిపబ్లికన్లు మెజారిటీగా ఉన్న కాంగ్రెస్​కు ట్రంప్ జూలై 4 వరకు గడువు ఇచ్చారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...