అక్షరటుడే, బోధన్: Mla Dhanpal | జిల్లా వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు (Navratri celebrations) వైభవంగా కొనసాగుతున్నాయి. బోధన్ నియోజకవర్గంలోని మోస్రా (Mosra), చింతకుంట (Chintakunta), తిమ్మాపూర్ గ్రామాల్లో శుక్రవారం దుర్గామాత మండపాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా దర్శించుకున్నారు.
ఈ మేరకు మండపాల్లో నిర్వహించిన చండీ హోమంలో పాల్గొన్నారు. తిమ్మాపూర్ గ్రామస్థులకు దేవుని రథం కోసం రూ.50వేలు, మోస్రా దుర్గా భవానికి రూ.5వేలు అందజేశారు. కార్యక్రమంలో భూపాల్ రెడ్డి, సుదర్శన్ గౌడ్, పీఏసీఎస్ ఛైర్మన్ జగన్మోహన్ రెడ్డి, రవి కోర్వ, శ్రీహరీ గౌడ్, నాగిరెడ్డి, శ్రీనివాస్, హన్మాండ్లు, అభిలాష్ గౌడ్, గణేష్, సంపత్, నరేష్ రెడ్డి పాల్గొన్నారు.