అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | మంచి నాయకులతోనే పట్టణ అభివృద్ధి సాధ్యంమవుతుందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివవాస్రెడ్డి(Mla Pocharam) అన్నారు. ఈమేరకు పట్టణంలోని పలు వార్డులలో ఆగ్రో ఇండస్ట్రీస్ (Agro Industries Chairman) ఛైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి పర్యటించారు.
Mla Pocharam | 5, 19వ వార్డులలో..
ఈ సందర్భంగా 19వ, 5వ వార్డుల ప్రజలతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో తమ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. రానున్న బాన్సువాడ మున్సిపాలిటీ (Banswada Municipality) ఎన్నికల్లో బాధ్యతతో పనిచేసే ప్రతినిధులను ఎన్నుకుంటే వార్డులు మరింత అభివృద్ధి సాధిస్తాయని తెలిపారు. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన తర్వాత బాన్సువాడ పట్టణంలో సుమారు రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని వెల్లడించారు. అనంతరం బీర్కూర్ మండలం మిర్జాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని అన్నారం గ్రామంలో రూ.23 లక్షలతో నిర్మించిన 250 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగి భవనాన్ని పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.