అక్షరటుడే, వెబ్డెస్క్ : Kalvakuntla Kavitha | హైదరాబాద్ నగరంలో (Hyderabad city) అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉప్పల్ ఒకటి. ఇక్కడ ఫ్లై ఓవర్ నిర్మాణం ఏళ్లుగా కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లై ఓవర్ పనులను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు.
జాగృతి జనంబాట కార్యక్రమంలో (Jagruti Janambata program) భాగంగా రామంతాపూర్లోని ఇందిరానగర్లో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి కవిత నివాళి అర్పించారు. అనంతరం ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులను (Uppal flyover work) పరిశీలించారు. పనుల ఆలస్యానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ఉప్పల్ ఫ్లై ఓవ ను 8 ఏళ్లుగా కడుతూనే ఉన్నారని విమర్శించారు. ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితి మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Kalvakuntla Kavitha | హామీ ఇచ్చారు..
ఫ్లై ఓవర్ అంశంపై తాను శాసన మండలిలో ప్రశ్నిస్తే.. మంత్రి కోమటి రెడ్డి (Minister Komati Reddy) స్పందించారన్నారు. త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తర్వాత ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ఉందని విమర్శించారు. జాగృతి జనం బాటలో భాగంగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తేవటానికి తాము ఇక్కడికి వచ్చామని తెలిపారు. ఘట్కేసర్ వరకు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడంతోనే ఆలస్యమవుతోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు.
