HomeతెలంగాణUpasana | కొత్త ఆవ‌కాయ ప‌చ్చ‌డిని దేవుడి ద‌గ్గ‌ర పెట్టి అత్త‌మ్మ‌తో క‌లిసి పూజ‌లు చేసిన...

Upasana | కొత్త ఆవ‌కాయ ప‌చ్చ‌డిని దేవుడి ద‌గ్గ‌ర పెట్టి అత్త‌మ్మ‌తో క‌లిసి పూజ‌లు చేసిన ఉపాస‌న‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ Surekha పుట్టినరోజు సందర్భంగా ఉపాసన upasana కొణిదెల.. తన కొత్త బిజినెస్ గురించి ప్రకటించిన విష‌యం తెలిసిందే. ‘అత్తమ్మ కిచెన్’ అనే పేరుతో తన అత్త సురేఖ రెసిపీలను మార్కెట్లోకి ప్రవేశపెడుతూ ఉంది.

మెగాస్టార్ చిరంజీవి కోడలుగా.. రామ్ చరణ్ భార్యగానే కాకుండా ఉపాసనకి ప్రత్యేకమైన ఫ్యాన్ఫా ఫాలోయింగ్ ఉంది. అందుకు ముఖ్య కారణం ఆమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండ‌డం అని చెప్ప‌వ‌చ్చు. అపోలో మేనేజ్మెంట్ చూసుకుంటూ ఎంతోమందికి తనవంతు సహాయం చేస్తూ ఉండడం, మెగా ఫ్యామిలీ బాధ్య‌త‌ల‌ని చూసుకుంటుండ‌డంతో అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటుంది ఉపాస‌న‌.

ఉపాసన కొణిదెల Upasana.. ఒక బిజినెస్ ఫ్యామిలీ నుండి వచ్చారు. తన కుటుంబం నడిచిన బాటలోనే తాను కూడా నడిచి సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్ గా ఎదిగింది. ఇప్ప‌టికే ఎన్నో వ్యాపారాల‌లో స‌క్సెస్ సాధించిన ఉపాస‌న తన అత్త కిచెన్ రెసిపీలను ఆధారంగా చేసుకొని బిజినెస్ ప్రారంభించింది. ఇప్పటికే తన అత్త సురేఖతో తనకున్న అనుబంధం ఎలా ఉంటుందో పలుమార్లు బయటపెట్టిన ఆమె.. సురేఖ పుట్టినరోజు సందర్భంగా ‘అత్తమ్మ కిచెన్’ అనే వెంచర్‌ను లాంచ్ చేసి అత్తపై ప్రేమను చాటుకున్నారు. ‘అత్తమ్మ కిచెన్’ ప్రొడక్ట్స్‌ను సోషల్ మీడియా నుండి మాత్రమే కాకుండా వెబ్‌సైట్ నుండి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.

ఇటీవ‌ల ఉపాస‌న త‌న అత్త‌మ్మ‌తో క‌లిసి ప‌చ్చడి Mango Pickle బిజినెస్ కూడా పెట్టించింది. ఈ క్ర‌మంలో ఉపాస‌న సోష‌ల్ మీడియా ద్వారా ఈ స్పెష‌ల్ వీడియో షేర్ చేసింది. ఇందులో అత్తా కోడ‌లు ఆవ‌కాయ ప‌చ్చ‌డి పెట్ట‌డం మ‌నం చూడ‌వ‌చ్చు. ఇద్ద‌రు చ‌క్క‌గా ఆవ‌కాయ ప‌చ్చ‌డి avakaya pacchadi పెట్ట‌డ‌మే కాకుండా దానిని జాడీలో ఉంచి, ఆ త‌ర్వాత దేవుడి ద‌గ్గ‌ర పెట్టి పూజ చేశారు. పోస్ట్‌కి “సురేఖ గారు అలియాస్ నా ప్రియ‌మైన అత్త‌మ్మ‌.. ఈ సీజ‌న్ ఆవ‌కాయ ప‌చ్చ‌డితో నిజంగానే అంద‌రిని అల‌రించింది. ఆహారం అంటే పోష‌కాహారం కాదు. సంస్కృతి, వారస‌త్వాన్ని కాపాడుకునే మార్గం” అని రాసుకొచ్చింది. ఇక దీనిని ఎలా ఆర్డ‌ర్ చేసుకోవాలో కూడా తెలియ‌జేసింది. మొత్తానికి ఉపాస‌న తెలివైన బిజినెస్‌మెన్‌గా ఎదుగుతుంది.