ACB Cases Telangana | ఏసీబీ దూకుడు.. ఏప్రిల్​లో ఎంతమంది చిక్కారంటే..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB | అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు దూకుడు పెంచారు. దీంతో ఏప్రిల్​ రికార్డు స్థాయిలో అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. ఏసీబీ ఏప్రిల్​లో మొత్తం 21 కేసులు నమోదు చేసింది. ఇందులో 12 ట్రాప్​ కేసులు trap case, రెండు ఆదాయానికి మించిన assets cases ఆస్తుల కేసులు ఉన్నాయి. రెండు క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, రెండు సాధారణ విచారణ, 2 తనిఖీల కేసులు ఉన్నట్లు ఏసీబీ తెలిపింది. మొత్తం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB | అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు దూకుడు పెంచారు. దీంతో ఏప్రిల్​ రికార్డు స్థాయిలో అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కారు.

ఏసీబీ ఏప్రిల్​లో మొత్తం 21 కేసులు నమోదు చేసింది. ఇందులో 12 ట్రాప్​ కేసులు trap case, రెండు ఆదాయానికి మించిన assets cases ఆస్తుల కేసులు ఉన్నాయి. రెండు క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, రెండు సాధారణ విచారణ, 2 తనిఖీల కేసులు ఉన్నట్లు ఏసీబీ తెలిపింది. మొత్తం 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు govt employees ఏసీబీకి చిక్కారు. ఆయా కేసుల్లో మొత్తం రూ.5.02 లక్షల నగదును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆదాయనికి మించి ఆస్తుల కేసులో రూ.3.51 కోట్ల ఆస్తులను గుర్తించారు. మరో కేసులో రూ.13.50 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు.

ACB | పెరిగిన అవగాహన

ప్రజల్లో ఏసీబీపై ACB telangana అవగాహన పెరిగింది. గతంలో ప్రభుత్వ అధికారులను ఎదురించడానికి ప్రజలు భయపడేవారు. అడిగినంత లంచం ఇచ్చి మరి పని చేయించుకునే వారు. అయితే ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖపై ప్రజల్లో అవగాహన పెరిగింది. దీంతో లంచం అడిగిన అధికారులను ఏసీబీకి పట్టిస్తున్నారు. ఏప్రిల్​లో దాదాపు పది మంది పోలీసులు ఏసీబీకి చిక్కారు.

ACB | భయం వద్దు.. ఫిర్యాదు చేయండి

లంచం ఇవ్వొద్దని ప్రజలకు ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు లంచం అడిగితే తమను సంప్రదించాలని కోరుతున్నారు. లంచం అడిగితే టోల్​ ఫ్రీ నంబర్ acb toll free number 1064 లేదా, acb contact number 9440446106కు వాట్సాప్​లో సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదుదారుల పేర్లు గోప్యంగా ఉంచుతామని, భయపడకుండా తమకు ఫోన్​ చేయాలని కోరుతున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...