Upasana | కొత్త ఆవ‌కాయ ప‌చ్చ‌డిని దేవుడి ద‌గ్గ‌ర పెట్టి అత్త‌మ్మ‌తో క‌లిసి పూజ‌లు చేసిన ఉపాస‌న‌

అక్షరటుడే, వెబ్​డెస్క్​: మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ Surekha పుట్టినరోజు సందర్భంగా ఉపాసన upasana కొణిదెల.. తన కొత్త బిజినెస్ గురించి ప్రకటించిన విష‌యం తెలిసిందే. ‘అత్తమ్మ కిచెన్’ అనే పేరుతో తన అత్త సురేఖ రెసిపీలను మార్కెట్లోకి ప్రవేశపెడుతూ ఉంది. మెగాస్టార్ చిరంజీవి కోడలుగా.. రామ్ చరణ్ భార్యగానే కాకుండా ఉపాసనకి ప్రత్యేకమైన ఫ్యాన్ఫా ఫాలోయింగ్ ఉంది. అందుకు ముఖ్య కారణం ఆమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండ‌డం అని చెప్ప‌వ‌చ్చు. అపోలో మేనేజ్మెంట్ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ Surekha పుట్టినరోజు సందర్భంగా ఉపాసన upasana కొణిదెల.. తన కొత్త బిజినెస్ గురించి ప్రకటించిన విష‌యం తెలిసిందే. ‘అత్తమ్మ కిచెన్’ అనే పేరుతో తన అత్త సురేఖ రెసిపీలను మార్కెట్లోకి ప్రవేశపెడుతూ ఉంది.

మెగాస్టార్ చిరంజీవి కోడలుగా.. రామ్ చరణ్ భార్యగానే కాకుండా ఉపాసనకి ప్రత్యేకమైన ఫ్యాన్ఫా ఫాలోయింగ్ ఉంది. అందుకు ముఖ్య కారణం ఆమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండ‌డం అని చెప్ప‌వ‌చ్చు. అపోలో మేనేజ్మెంట్ చూసుకుంటూ ఎంతోమందికి తనవంతు సహాయం చేస్తూ ఉండడం, మెగా ఫ్యామిలీ బాధ్య‌త‌ల‌ని చూసుకుంటుండ‌డంతో అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటుంది ఉపాస‌న‌.

ఉపాసన కొణిదెల Upasana.. ఒక బిజినెస్ ఫ్యామిలీ నుండి వచ్చారు. తన కుటుంబం నడిచిన బాటలోనే తాను కూడా నడిచి సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్ గా ఎదిగింది. ఇప్ప‌టికే ఎన్నో వ్యాపారాల‌లో స‌క్సెస్ సాధించిన ఉపాస‌న తన అత్త కిచెన్ రెసిపీలను ఆధారంగా చేసుకొని బిజినెస్ ప్రారంభించింది. ఇప్పటికే తన అత్త సురేఖతో తనకున్న అనుబంధం ఎలా ఉంటుందో పలుమార్లు బయటపెట్టిన ఆమె.. సురేఖ పుట్టినరోజు సందర్భంగా ‘అత్తమ్మ కిచెన్’ అనే వెంచర్‌ను లాంచ్ చేసి అత్తపై ప్రేమను చాటుకున్నారు. ‘అత్తమ్మ కిచెన్’ ప్రొడక్ట్స్‌ను సోషల్ మీడియా నుండి మాత్రమే కాకుండా వెబ్‌సైట్ నుండి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.

ఇటీవ‌ల ఉపాస‌న త‌న అత్త‌మ్మ‌తో క‌లిసి ప‌చ్చడి Mango Pickle బిజినెస్ కూడా పెట్టించింది. ఈ క్ర‌మంలో ఉపాస‌న సోష‌ల్ మీడియా ద్వారా ఈ స్పెష‌ల్ వీడియో షేర్ చేసింది. ఇందులో అత్తా కోడ‌లు ఆవ‌కాయ ప‌చ్చ‌డి పెట్ట‌డం మ‌నం చూడ‌వ‌చ్చు. ఇద్ద‌రు చ‌క్క‌గా ఆవ‌కాయ ప‌చ్చ‌డి avakaya pacchadi పెట్ట‌డ‌మే కాకుండా దానిని జాడీలో ఉంచి, ఆ త‌ర్వాత దేవుడి ద‌గ్గ‌ర పెట్టి పూజ చేశారు. పోస్ట్‌కి “సురేఖ గారు అలియాస్ నా ప్రియ‌మైన అత్త‌మ్మ‌.. ఈ సీజ‌న్ ఆవ‌కాయ ప‌చ్చ‌డితో నిజంగానే అంద‌రిని అల‌రించింది. ఆహారం అంటే పోష‌కాహారం కాదు. సంస్కృతి, వారస‌త్వాన్ని కాపాడుకునే మార్గం” అని రాసుకొచ్చింది. ఇక దీనిని ఎలా ఆర్డ‌ర్ చేసుకోవాలో కూడా తెలియ‌జేసింది. మొత్తానికి ఉపాస‌న తెలివైన బిజినెస్‌మెన్‌గా ఎదుగుతుంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...