అక్షరటుడే, బాన్సువాడ: Banswada | అకాల వర్షాలు అన్నదాతను కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తున్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలోని (Banswada constituency) అన్ని మండలాల్లో వర్షాల కారణంగా ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యింది.
Banswada | అమ్ముకునే సమయానికి..
ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునే సమయానికి వరుణుడు రైతులను ఆగం చేస్తున్నాడు. నియోజకవర్గంలోని బీర్కూర్, బాన్సువాడ, నస్రుల్లాబాద్ (Nasurullabad), పోతంగల్, కోటగిరి, రుద్రూర్ మండలాల్లో సోమవారం రాత్రి కురిసిన భారీవర్షం (heavy rains) కారణంగా ధాన్యం పూర్తి తడిసిపోయింది.
Banswada | రోడ్లపై కల్లాల్లో..
రోడ్లపై, కల్లాల్లో ఆరబెట్టిన పంట తడిసిపోయి రైతుల కష్టం నీళ్లపాలైంది. ఆర్నెళ్లు కష్టపడి పండించిన పంట రాత్రిరాత్రే వర్షార్పాణమైందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం మార్కెట్‌లో కొనుగోలు చేయకపోతే తమకు తీవ్రనష్టం వాటిల్లుతుందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.