ePaper
More
    HomeతెలంగాణMinister Kishan Reddy | సీఎం రేవంత్​ వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

    Minister Kishan Reddy | సీఎం రేవంత్​ వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Minister Kishan Reddy | పహల్​గామ్​ ఉగ్రదాడి తర్వాత భారత్​ ఆపరేషన్​ సిందూర్​ (operation sindoor) చేపట్టి పాకిస్తాన్​కు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. అనంతరం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. కాగా.. సీజ్​ ఫైర్​పై సీఎం రేవంత్​రెడ్డి (CM revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (prime minister narendra modi) అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ (US president trump) ఒత్తిడికి భయపడి లొంగిపోయారంటూ వ్యాఖ్యానించారు. ఆపరేషన్​ సిందూర్​ అనంతరం ట్రంప్​ భయపెట్టడంతో మోదీ కాల్పుల విరమణకు అంగీకరించారంటూ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం (central governament) పాకిస్తాన్​ను చిత్తు చేసే అవకాశాన్ని వదులుకుని వెనకడుగు వేసిందంటూ పలు వ్యాఖ్యలు చేశారు.

    Minister Kishan Reddy | కిషన్​ రెడ్డి ఫైర్​

    కాగా.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి (Union Minister Kishan Reddy) ఫైర్​ అయ్యారు. ‘పాకిస్థాన్‌పై అపరేషన్ సిందూర్‌ ద్వారా భారత సైన్యం (Indian Army) విజయం సాధించింది. కానీ ఈ విజయాన్ని తక్కువ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ (congress party) దివాలా కోరుతనానికి నిదర్శనం. భారత సైన్యం దెబ్బకు కంగుతిన్న పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. కానీ.. యుద్ధం ఆపారని సైన్యం మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి మాట్లాడడం దుర్మార్గం. భారత సైన్యం (indian army) ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ మాట్లాడిన సీఎం రేవంత్, కాంగ్రెస్ అధినాయకత్వం సైన్యానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి’ అని కిషన్​ రెడ్డి (kishan reddy) డిమాండ్ చేశారు.

    More like this

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....

    CMRF Checks | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Checks | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి(Ramchandrapalli Village) చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న...

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...