Minister Nitin Gadkari | డబ్బులిచ్చి నాపై దుష్ప్రచారం చేయిస్తున్నారు.. పెట్రోల్ లాబీపై కేంద్ర మంత్రి గడ్కరీ ఆగ్రహం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Nitin Gadkari | కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ (Minister for Road Transport & Highways Nitin Gadkari) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బులిస్తూ తనపై సోషల్ మీడియాలో (Social Media) దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాల కోసం తాము నిర్ణయాలు తీసుకుంటుంటే.. కొందరు మాత్రం రాజకీయంగా తనపై దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు. న్యూఢిల్లీలో గురువారం (సెప్టెంబరు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Nitin Gadkari | కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ (Minister for Road Transport & Highways Nitin Gadkari) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

డబ్బులిస్తూ తనపై సోషల్ మీడియాలో (Social Media) దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాల కోసం తాము నిర్ణయాలు తీసుకుంటుంటే.. కొందరు మాత్రం రాజకీయంగా తనపై దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు.

న్యూఢిల్లీలో గురువారం (సెప్టెంబరు 11) జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల (Society of Indian Automobile Manufacturers) 65వ వార్షిక సమావేశంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.

పెట్రోల్​లో 20 శాతం ఇథనాల్ కలపాలనే ప్రభుత్వ చర్యను తప్పుబడుతూ దుష్ప్రచారం చేస్తున్న పెట్రోల్ లాబీని తీవ్రంగా విమర్శించారు.

“లాబీలు ఉన్న ప్రతిచోట ఆసక్తులు ఉన్నాయి.. పెట్రోల్ లాబీ చాలా ధనవంతులు” అని కేంద్ర మంత్రి అన్నారు.

“సోషల్ మీడియాలో జరుగుతున్నది నాకు వ్యతిరేకంగా చేసిన చెల్లింపు ప్రచారం. సుప్రీంకోర్టు (Supreme Court) కూడా పిటిషన్ను తోసిపుచ్చింది. అందులో ఎటువంటి వాస్తవం లేదని” వ్యాఖ్యానించారు.

Minister Nitin Gadkari | దేశానికి, రైతులకు ప్రయోజనం..

పెట్రోల్​లో 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల దేశానికి, మన రైతులకు (Farmers) ఎంతో లబ్ధి చేకూరుతుందని గడ్కరీ తెలిపారు.

శిలాజ ఇంధన ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి భారీ మొత్తంలో వెచ్చించాల్సి వస్తోందన్నారు. ఈ భారాన్ని తగ్గించుకుని, ఆ మొత్తాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో (Indian economy) పెట్టడం మంచిదా.. కాదా? అని ప్రశ్నించారు.

శిలాజ ఇంధనాలకు ఇథనాల్ మంచి ప్రత్యామ్నయమని, అందుబాటు ధరలో స్వదేశంలో ఉత్పత్తి అవుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

మొక్కజొన్న నుంచి తీసే ఇథనాల్ వల్ల మన రైతులు రూ.45 వేల కోట్ల మేర లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఇథనాల్ వినియోగం వల్ల కాలుష్యం కూడా తగ్గుతుందని తెలిపారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...