అక్షరటుడే, హైదరాబాద్: Cyber Crime | సైబర్ నేరగాళ్లు Cyber criminals రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం government, పోలీసులు police ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా.. సైబర్ మాఫియా cyber mafia వలలో అమాయక ప్రజలు పడిపోతూనే ఉన్నారు. నిలువు దోపిడీకి గురై అచేతనులవుతున్నారు.
తాజాగా హైదరాబాద్‌లో ఓ లేడీ టీచర్‌ను దోచుకున్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి రూ.7 లక్షలు కాజేశారు. మోసపోయిన విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
Cyber Crime | సీబీఐ అధికారిగా బెదిరింపులు..
వివరాల్లోకి వెళ్తే.. అమీర్ పేటలో ఉండే ఓ మహిళా టీచర్‌కు సెప్టెంబరు 28న గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వీడియో కాల్ వచ్చింది. మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్తు చేస్తామని ఆమెను నేరగాళ్లు బెదిరించారు.
దేశ సర్వోన్నత న్యాయస్థానం Supreme Court ప్రధాన న్యాయమూర్తి Chief Justice పేరుతో లేఖ కూడా పంపించారు. బాధితురాలితో మాట్లాడిన కిలాడీ లేడీ తనను తాను ట్రాయ్ ఎంప్లాయ్ ప్రియా శర్మగా పరిచయం చేసుకుంది.
బాధితురాలి ఆధార్ Aadhaar నంబరును వినియోగించి ముంబయిలో అక్రమంగా సిమ్ కార్డు కొనుగోలు చేసినట్లు భయపెట్టింది. ఆమె మాట్లాడుతుండగానే.. మరో వ్యక్తి లైన్లోకి వచ్చాడు.
అతగాడు సీబీఐ CBI అధికారి విజయన్నాగా పరిచయం చేసుకున్నాడు. మనీ ల్యాండరింగ్ కేసులో నీ ప్రమేయం ఉందని భయపెడుతూ ఆమను ఆ రాత్రంతా వీడియో కాల్‌లోనే ఉండాలని బెదిరించారు.
ఆ మరుసటి రోజు ఈడీ నుంచి అరెస్టు లేఖ ఇష్యూ చేసినట్లు ఆమెకు నేరగాళ్లు పంపారు. అనంతరం బాధితురాలి నుంచి రూ.7 లక్షలు తమ ఖాతాలో జమ చేయించుకున్నారు. కేసు విచారణ పూర్తయ్యాక డబ్బులు తిరిగి ఇస్తామని నమ్మబలికారు.
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న బాధితురాలు ఆలస్యంగా తేరుకుని, తాను మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
1 comment
[…] తీసుకుంటున్నా.. సైబర్ నేరగాళ్ల cyber criminals ఆగడాలకు అడ్డు లేకుండా […]
Comments are closed.