అక్షరటుడే, బోధన్ : Panchayat Elections | పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ అభ్యర్థులు ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు చిత్రవిచిత్రాలు సైతం ప్రజలకు చూసే అవకాశం కలుగుతోంది. సాలూర మండలం (Salura Mandal) కొమ్మనపల్లి గ్రామం (Kommanapalli Village)లో సర్పంచ్ పదవి కోసం సొంత మేనమామపై మేనల్లుడు పోటీకి దిగారు.
Panchayat Elections | మామ అల్లుళ్ల సవాల్‌తో..
మామ, అల్లుడు సర్పంచ్ (Sarpanch) పదవి కోసం పోటీలో దిగడంతో పోటీ రసవత్తరంగా సాగుతోంది. శ్రీనివాస్ రెడ్డి అతని మేనల్లుడైన మహేందర్ రెడ్డిలు సర్పంచ్ కోసం పోటీ పడుతున్నారు. మామ శ్రీనివాస్ రెడ్డి 2013 నుండి 2018 వరకు గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. అదేవిధంగా రెండు పర్యాయాలు మార్కెట్ కమిటీ డైరెక్టర్ (Market Committee Director) గా కూడా పనిచేశారు. ఈసారి జనరల్ రావడంతో శ్రీనివాస్ రెడ్డి పోటీకి నిలబడగా అతడి మేనల్లుడు మహేందర్ రెడ్డి కూడా బరిలో దిగారు. మహేందర్ రెడ్డికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. అయితే ఉన్నత చదువులు చదివిన మహేందర్ రెడ్డి గ్రామంలోనే స్థిరపడి వ్యవసాయం చేసుకుంటున్నాడు. అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో మామా అల్లుళ్ల పోరులో ఎవరు గెలుస్తారోనని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.