Homeతాజావార్తలుUnanimous Sarpanch | నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఎదురుదెబ్బ​.. బీఆర్​ఎస్​ బలపర్చిన సర్పంచి అభ్యర్థులు...

Unanimous Sarpanch | నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఎదురుదెబ్బ​.. బీఆర్​ఎస్​ బలపర్చిన సర్పంచి అభ్యర్థులు ఏకగ్రీవం!

సర్పంచి ఎన్నికల్లో ప్రచార పర్వం మొదలుకాకుండానే అధికార కాంగ్రెస్​ పార్టీకి చెందిన నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Unanimous Sarpanch | నిజామాబాద్​ జిల్లాలో సర్పంచి స్థానిక సంస్థల ఎన్నికలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. రెండో విడత నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగిసింది.

కాగా, ఇంకా ప్రచార పర్వం మొదలుకాకుండానే అధికార పార్టీకి చెందిన నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Nizamabad Rural MLA Bhupathi Reddy) కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

నిజామాబాద్ రూరల్​ నియోజకవర్గంలోని నిజామాబాద్​ మండలం పాల్దా గ్రామ సర్పంచి అభ్యర్థిగా ప్రభాకర్​ ఒక్కరే నామినేషన్​ వేశారు. ఈయనకు బీఆర్ఎస్​ మద్దతు పలికింది. కాగా, కాంగ్రెస్​, బీజేపీ నుంచి ఏ ఒక్కరు కూడా సర్పంచి బరిలో నిలబడక పోవడం గమనార్హం.

బీఆర్​ఎస్​ బలపర్చిన అభ్యర్థి ప్రభాకర్​ ఒక్కరే నామినేషన్​ వేయడంతో.. ఈయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది.

Unanimous Sarpanch | ఎమ్మెల్యే సొంత మండలంలో ఊహించని పరిణామం..

అధికార కాంగ్రెస్​ పార్టీకి చెందిన రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సొంతూరు నిజామాబాద్​ మండలంలోని జలాల్​పూర్​ గ్రామం. ఈ గ్రామానికి సమీపంలో ఉన్న పాల్దాలోనే బీఆర్​ఎస్​ బలపర్చిన అభ్యర్థి సర్పంచి ఏకగ్రీవం చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

అధికార పార్టీకి అసలు ఎవరూ అభ్యర్థులే దొరకలేదా.. బరిలో నిలిచేందుకు పార్టీ నేతలు ఆసక్తి చూపలేదా.. అనే చర్చకు దారితీసింది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే తన సొంత మండలంలో సర్పంచి అభ్యర్థి విషయంలో చేతులు ఎత్తేయడం ఏమిటని చర్చ జరుగుతోంది.

మరోవైపు ఇదే గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని వార్డులకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు​ హోరా హోరీగా నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. సర్పంచి స్థానానికి మాత్రం దూరం ఉన్నారు.

Unanimous Sarpanch | ధర్పల్లి మండలంలోనూ..

నిజామాబాద్​ రూరల్​ నియోజకవర్గంలోని ధర్పల్లి మండలంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ మండలంలోని సీతాయిపేట్​ గ్రామ సర్పంచిగా భారాస బలపర్చిన అభ్యర్థి భూమేశ్​ కూడా ఏకగ్రీవం అయ్యారు. ఈయనకు కూడా అధికార పార్టీ నుంచి పోటీ లేకుండా పోయింది. ఇదే మండలంలోని ఇంద్రానగర్ తండా సర్పంచిగా కూడా బీఆర్​ఎస్​ బలపర్చిన అభ్యర్థి బాలు నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Must Read
Related News