అక్షరటుడే, లింగంపేట : Sarpanch Elections | లింగంపేట (Lingampet) మండలం నల్లమడుగు పెద్దతండా పంచాయతీ పాలకవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్‌గా సంగీత మాన్సింగ్, ఉప సర్పంచ్‌గా షీలా మోహన్ ఎన్నికయ్యారు. పంచాయతీ అభివృద్ధి చెందాలని అందరం కలిసికట్టుగా పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తండావాసులు తెలిపారు.
Sarpanch Elections | వర్ని మండలంలో..
అక్షరటుడే, వర్ని: మండలంలోని రెండు గ్రామపంచాయతీలో సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గురువారం తీర్మానం చేశారు. సిద్దాపూర్ సర్పంచ్‌గా బాల్ సింగ్, చెలక తండా సర్పంచ్‌గా గంగారాం మాత్రమే నామినేషన్లు దాఖలు చేయాలని గ్రామస్తులు తీర్మానాలు చేశారు. ఇందుకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించొద్దన్నారు.
