Homeజిల్లాలునిజామాబాద్​Local Body Elections | బోధన్​లో ఏకగ్రీవాల జోరు..

Local Body Elections | బోధన్​లో ఏకగ్రీవాల జోరు..

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏకగ్రీవాలు జోరందుకున్నాయి. పలు గ్రామాల్లో సర్పంచులతో పాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్​: Local Body Elections | పంచాయతీ ఎన్నికల్లో (panchayat elections) భాగంగా ఏకగ్రీవాలు జోరందుకున్నాయి.

బోధన్​ నియోజకవర్గంలో (Bodhan constituency) నామినేషన్ల ఉపసంహరణ బుధవారం ముగిసింది. చివరిరోజు సర్పంచ్, వార్డు మెంబర్ల​ (sarpanch and ward members)  పదవులను ఏకగ్రీవం చేసేందుకు స్థానిక నాయకులు జోరుగా మంతనాలు జరిపారు. ఈ మేరకు పలు గ్రామాల్లో పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

Local Body Elections | వర్ని మండలంలో..

వర్నిమండలలోని పలు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. రూప్లానాయక్​ తండా, సిద్దాపూర్​, వకీల్​ ఫారం, ఆఫాందిఫారం, సైదాపూర్​, రాజ్​పేట్​, ఛలక్​తండా, చింతల్​పేట్​ తండా, మల్లారం ఏకగ్రీవాలయ్యాయి.

బోధన్​ మండలంలో..

మావందికలాన్​, భూలక్ష్మిక్యాంప్​, పెంటాకలాన్​, పెంటాకుర్దు క్యాంప్​ ఏకగ్రీవమైనట్లు అధికారులు వెల్లడించారు.

సాలూర మండలంలో..

సాలూరా క్యాంప్​, సాలంపాడ్​, ఫతేపూర్​ మూడు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి.

కోటగిరిలో..

రాంపూర్​, అడ్కాస్​పల్లి, సుద్దులం తండా, వల్లభాపూర్​, దేవునిగుట్ట తండా.

చందూర్​లో..

చందూర్​ మండలంలో లక్ష్మాపూర్​, కారేగాం ఏకగ్రవమయ్యాయి.

పోతంగల్​..

పీఎస్​ఆర్​ నగర్​ గ్రామం ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు.

ఎడపల్లిలో..

బాపూనగర్​.

నవీపేట్​ మండలంలో..

నారాయణపూర్​ గ్రామం ఏకగ్రీవమైనట్లు అధికారులు పేర్కొన్నారు.

Must Read
Related News