అక్షరటుడే, వెబ్‌డెస్క్: Navy officer | నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ Navy officer Lieutenant Vinay Narwal (26) ను దురదృష్టం వెంటాడింది. వారం క్రితమే వివాహం చేసుకున్న ఆయన వాస్తవానికి హానిమూన్‌కు honeymoon యూరప్‌కు Europe వెళ్లాల్సింది. కానీ వీసా దొరకక పోవడంతో భార్యను తీసుకుని కాశ్మీర్ Kashmir పర్యటనకు వెళ్లిన ఆయన ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయారు. ఏప్రిల్ 16న హిమాన్షిని పెళ్లాడిన నర్వాల్ భార్యను wife తీసుకుని కాశ్మీర్ Kashmir వెళ్లడమే పాపమైంది. మత religious ఛాందసవాదుల తూటాలకు బలి కావాల్సి వచ్చింది.
Navy officer | నర్వాల్‌ది ఉన్నత కుటుంబం
హర్యానాలోని Haryana కర్నాల్‌కు చెందిన వినయ్ నర్వాల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. మూడేళ్ల క్రితం నేవీలో లెఫ్టినెంట్‌గా చేరాడు కేరళలోని Kerala కొచ్చిలో Kochi పని చేస్తున్నాడు. వినయ్ తండ్రి రాజేశ్‌కుమార్ పానిపట్‌లోని కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌లో Customs Department సూపరింటెండెంట్. అతని తాత హవా సింగ్ 2004లో హర్యానా పోలీసు Haryana Police విభాగం నుండి పదవీ విరమణ చేశారు. అతని తల్లి ఆశాదేవి, అమ్మమ్మ బిరు దేవి గృహిణులు. వినయ్ చెల్లెలు సృష్టి ఢిల్లీలో సివిల్ సర్వీసెస్‌కు Delhi Civil Services సిద్ధమవుతోంది.
Navy officer | యూరప్‌కు వెళ్లాలనుకుని..
నర్వాల్‌కు Narwal రెండు నెలల క్రితం గుర్గావ్‌కు Gurgaon చెందిన హిమాన్షితో నిశ్చితార్థం జరిగింది. పీహెచ్‌డీ PHD చేస్తున్న హిమాన్షి పిల్లలకు ఆన్‌లైన్ తరగతులు online classes చెబుతుంటుంది. ఆమె తండ్రి సునీల్ కుమార్ గుర్గావ్‌లో ఎక్సైజ్ మరియు టాక్సేషన్ అధికారి excise and taxation officer. వినయ్, హిమాన్షి పెండ్లికి ముహూర్తం ఖరారు కావడంతో వినయ్ మార్చి 28 నుంచి సెలవు పెట్టాడు. ఏప్రిల్ 16న ముస్సోరీలో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఏప్రిల్ 19న కర్నాల్‌లో గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించారు. ఆ తర్వాత హనిమూన్‌కు వెళ్లాలనుకున్నారు. యూరప్ పర్యటనకు Europe trip వెళ్లాలని భావించగా, వీసా visa దొరకలేదు.
దీంతో చేసేది లేక కాశ్మీర్ పర్యటనకు Kashmir trip వెళ్లారు. అక్కడ ఉగ్రవాదుల terrorists కాల్పులకు నర్వాల్ బలయ్యాడు. భర్తతో కలిసి జీవించాలనుకున్న హిమాన్షి కలలను ముష్కరులు చిదిమేశారు. నర్వాల్ Narwal మృతదేహం వద్ద మౌనంగా రోదిస్తున్న హిమాన్షి ఫొటో వైరల్ photo viral అయింది. “నేను నా భర్తతో కలిసి భేల్ పూరీ తింటుండగా ఒక వ్యక్తి వచ్చి పేరు అడిగాడు. ముస్లింను కాదని నిర్దారించుకుని నర్వాల్‌ను కాల్చి చంపాడు” అని హిమాన్షి చెబుతున్న వీడియో కూడా సోషల్‌మీడియాలో social media వైరల్ అయింది.