Hyderabad KPHB | ప్రేమించిన యువతి దక్కలేదని.. పెళ్లి చేసుకున్నోడిని ఖతం చేసిండు
Hyderabad KPHB | ప్రేమించిన యువతి దక్కలేదని.. పెళ్లి చేసుకున్నోడిని ఖతం చేసిండు

అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad KPHB : తను ప్రేమించిన యువతిని తనకు కాకుండా వేరే యువకుడికి ఇచ్చి పెళ్లి చేయడంతో కక్ష పెంచుకున్న భగ్న ప్రేమికుడు.. తన ప్రేయసిని వివాహమాడిన వ్యక్తిని హతమార్చాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని కూకట్​పల్లిలో చోటుచేసుకుంది.

కేపీహెచ్​బీ పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh లోని తూర్పు గోదావరి జిల్లా East Godavari district అడవిపూడికి చెందిన అన్నదమ్ములు మేడిశెట్టి జగదీశ్, దుర్గాప్రసాద్ తమ కుటుంబాలతో కలిసి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్​కు వచ్చి సర్దార్​ పటేల్​ నగర్​ Sardar Patel Nagar లో ఉంటున్నారు.

దుర్గాప్రసాద్ మరదలు శ్రావణి సంధ్య వీళ్లతోనే ఉంటోంది. అడవిపూడికే చెందిన పంపైన అయ్యప్పస్వామి అలియాస్ పవన్​కుమార్ ఇదే కాలనీలో ఉంటూ ఆటోడ్రైవర్​గా పనిచేస్తున్నాడు. కాగా, తను శ్రావణిసంధ్యను ప్రేమిస్తున్నానని, తనకిచ్చి పెళ్లి చేయాలని కొన్నేళ్ల కింద ఆమె కుటుంబ సభ్యులను కోరాడు. అందుకు వారు సమ్మతించలేదు. అయితే, అదే కాలనీలో ఉంటూ ఆటో నడుపుకొనే కళ్ల వెంకటరమణ(30)కు సంధ్యను ఇచ్చి వివాహం చేశారు.

దీంతో కక్ష పెంచుకున్న పవన్ కుమార్ తరచూ వెంకటరమణ, అతడి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే వెంకటరమణను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తన స్నేహితుల సాయం కోరాడు.

శ్రావణి సంధ్య మూడు రోజుల కింద ఊరికి వెళ్లింది. దీంతో వెంకటరమణ భోజనానికి జగదీశ్ ఇంటికి వచ్చేవాడు. దీనిని గమనించిన పవన్​కుమార్ ఆదివారం అర్ధరాత్రి 12.20 గంటలకు తన నలుగురు స్నేహితులతో కలిసి జగదీశ్ ఇంటి సమీపంలోకి చేరుకున్నారు. అక్కడ పెద్దగా అరవడం మొదలుపెట్టారు.

ఇది గమనించిన జగదీశ్ బయటకు వచ్చి వారిని మందలించాడు. ఈ క్రమంలో పవనకుమార్, అతడి స్నేహితులు గొడవకు దిగారు. దీంతో స్థానికులను పిలిచేందుకు జగదీశ్ అక్కడి నుంచి వెళ్లగా.. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం.. ఐదుగురు కలిసి కత్తులతో వెంకటరమణ ఛాతిలో పొడిచి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ వెంకటరమణ అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.