అక్షరటుడే, ఆర్మూర్ : Armoor Municipality | ఆర్మూర్ మున్సిపల్ నూతన కమిషనర్‌గా ఉమామహేశ్వరరావు (Uma Maheswara Rao) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రామగుండం పురపాలక సంఘం అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సెక్రెటరీగా విధులు నిర్వహించిన ఆయనను ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు.
Armoor Municipality | గత కమిషనర్ శిక్షణకు..
ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్‌గా వ్యవహరించిన పూజారి శ్రావణి హైదరాబాద్ (Hyderabad) మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరుగుతున్న శిక్షణకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఆమె స్థానంలో ఉమామహేశ్వరరావు వచ్చారు. శుక్రవారం బాధ్యతలు చేపట్టిన కమిషనర్‌కు మున్సిపల్ సిబ్బంది స్వాగతం పలికారు. రానున్న మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) సజావుగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు.