అక్షరటుడే, ఆర్మూర్: Armoor Municipality | ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్గా ఉమామహేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 47 మంది కమిషనర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు వెలువరించింది.
రామగుండం పురపాలక (Ramagundam Municipality) సంఘంలో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఉమామహేశ్వరరావును ఆర్మూర్ మున్సిపల్ (Armoor Municipality) కమిషనర్గా బదిలీ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్గా వ్యవహరిస్తున్న పూజారి శ్రావణి రెండు రోజుల క్రితం శిక్షణకు వెళ్లారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్(Jubilee Hills)లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో (Human Resource Development Institute) 45 రోజుల శిక్షణలో ఆమె పాల్గొంటారు. దీంతో తాజాగా ఉమామహేశ్వరరావును ప్రభుత్వం నియమించింది.