HomeUncategorizedInsurance Money | ఇన్సూరెన్స్ కోసం రెండు కాళ్లు తొల‌గించుకున్న‌ బ్రిటన్‌ డాక్టర్‌… షాకింగ్ నిజాలు...

Insurance Money | ఇన్సూరెన్స్ కోసం రెండు కాళ్లు తొల‌గించుకున్న‌ బ్రిటన్‌ డాక్టర్‌… షాకింగ్ నిజాలు బయటకు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Insurance Money | బ్రిటన్‌కు చెందిన 49 ఏళ్ల వాస్కులర్ సర్జన్ డాక్టర్ నీల్ హాపర్ ఇన్సూరెన్స్ డబ్బుల (Insurance Money) కోసం తన రెండు కాళ్లను తానే స్వయంగా తొలగించుకున్నాడు. ఈ సంఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్​టాపిక్‌గా మారింది.

హాపర్ తన రెండు కాళ్లను కోల్పోయాక‌, అందుకు సెప్సిస్‌ కారణమని ఇన్సూరెన్స్ కంపెనీలకు తెలియ‌జేశాడు. అంటే తనకు రక్తనాళాల సమస్య ఉందని, మోకాళ్లను తొలగించుకోని ప‌క్షంలో అది శరీరమంతా వ్యాపిస్తుందని అత‌డు బీమా సంస్థలను నమ్మించే ప్రయత్నం అయితే చేశాడు. తాను ముందుగా సమాచారం ఇవ్వని కారణంతో బీమా సంస్థలు (Insurance Companies) అతని క్లెయిమ్‌లను తిరస్కరించ‌డం జ‌రిగింది.

Insurance Money | ఎంత ప‌ని చేశావ్..

అయితే ఈ విష‌యంపై కోర్టులో విచారణ జరిగినప్పుడు ఇది ఒక పెద్ద నాటకం అని బయటపడింది. అతను అసలైన కారణాన్ని దాచిపెట్టినట్టు, కోర్టు సాక్ష్యాల ద్వారా తేలింది. హాపర్, రెండు ఇన్సూరెన్స్ కంపెనీలకు క్లెయిమ్ దాఖలు చేశాడు. అరివా గ్రూప్ నుంచి 2,35,622 పౌండ్స్, ఓల్డ్ మ్యూచువల్ నుంచి 2,31,031 పౌండ్స్ మొత్తం కలిసి సుమారు రెండు సంస్థల నుంచి 5,00,000 పౌండ్ల (రూ. 5.4 కోట్లు) బీమా డబ్బు పొందాలన్నదే అతని ఉద్దేశం. కోర్టు విచారణలో, హాపర్ ‘The Eunuch Maker’ అనే వెబ్‌సైట్ నుంచి అవయవ తొలగింపు వీడియోలు కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. అంతేకాదు, ఇలాంటి శస్త్రచికిత్సలు చేసే మారియస్ గుస్తావ్‌సన్‌ అనే వ్యక్తిని సంప్రదించి, తనపై కూడా అదే విధంగా చేసేలా ప్రోత్సహించినట్టు సాక్ష్యాలు వెల్లడయ్యాయి.

హాపర్ 2013 నుంచి Royal Cornwall Hospitals NHS Trustలో సర్జన్‌గా పనిచేస్తున్నాడు. కానీ 2023 మార్చిలో ఈ సంఘటన వెలుగులోకి రావడంతో సస్పెండ్ అయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో హాపర్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆశ్చర్యం కలిగించాయి. నాకు పవర్ టూల్స్ అంటేనే మోజు. ‘చాలా అవయవ తొలగింపు ఆపరేషన్లు చేశాను. మూడు నెలల్లో నడుస్తాను అనుకున్నా.. కానీ మూడు గంటల్లోనే నడిచాను. ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ ఎనర్జీతో ఉన్నాను అని అన్నాడు. ఇవ‌న్నీ వింటుంటే ఇది ఒక మానసిక స్థితిగతులతో కూడిన విచిత్రమైన కేసుగా అనిపిస్తుంది.