అక్షరటుడే, వెబ్‌డెస్క్: UAE President | యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (UAE President Sheikh Mohammed bin Zayed Al Nahyan) భారత పర్యటనకు వచ్చారు. సోమవారం ఆయన ఢిల్లీకి చేరుకోగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఘన స్వాగతం పలికారు.
ప్రధాని మోదీ ఢిల్లీ విమానాశ్రయంలో (Delhi airport) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడిని స్వాగతించారు. న్యూఢిల్లీ అబుదాబితో తన భాగస్వామ్యానికి కలిగి ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. తన సోదరుడు, యూఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలకడానికి ఎయిర్ పోర్ట్‌కు వెళ్లినట్లు ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ చేశార.
UAE President | కీలక చర్చలు
మోదీ, యూఏఈ అధ్యక్షుడి మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, అంతరిక్షం, సాంకేతికత, ఆహార భద్రతపై ఇద్దరు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. మీడిల్ ఈస్ట్‌లో అస్థిరత, ఇరాన్-యూఎస్ సంబంధాలు (Iran-US relations) దెబ్బతినడం, యెమెన్ విషయంలో సౌదీ అరేబియా– యూఏఈ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు గురించి చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాన్ని కూడా ఇరు వర్గాలు సమీక్షిస్తాయని భావిస్తున్నారు.
UAE President | మూడోసారి భారత్‌కు..
UAE అధ్యక్షుడైన తర్వాత జాయెద్ అల్ నహ్యాన్ మూడో సారి భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయన గతంలో 2024 సెప్టెంబర్, 2025 ఏప్రిల్‌లో భారత్‌లో పర్యటించారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA), స్థానిక కరెన్సీ పరిష్కారం (LCS), ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంతో రెండు దేశాలు మధ్య బంధం కొన్నేళ్లుగా కీలకంగా మారింది.