Homeక్రైంSangareddy | సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న తుఫాన్ వాహనం, ఒకరు...

Sangareddy | సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న తుఫాన్ వాహనం, ఒకరు స్పాట్‌ డెడ్​..

ఇటీవ‌ల బ‌స్సు ప్ర‌మాదాలు త‌ర‌చుగా జ‌రుగుతున్నాయి. తాజాగా జ‌రిగిన బ‌స్సు ప్రమాదంలో ఓ వ్య‌క్తి మృతి చెందాడు. మ‌రో ఆరుగురికి తీవ్ర గాయాలు అయిన‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sangareddy | సంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఉదయం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంది మండల పరిధిలోని చేర్యాల గేటు వద్ద ఆర్టీసీ బస్సును (RTC bus) వేగంగా దూసుకొచ్చిన తుఫాన్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నారాయణఖేడ్‌ చాంద్‌ఖాన్‌పల్లి గ్రామానికి చెందిన బాలయ్య (52) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Sangareddy | ఘోర ప్ర‌మాదం..

సంగారెడ్డి రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి (SI Madhusudhan Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. తూప్రాన్ మండలం అల్లాపూర్‌కు చెందిన ప్రవీణ్, న్యాల్కల్ మండలం రత్నపూర్ గ్రామానికి చెందిన ఫరీద్, సిర్గాపూర్‌కు చెందిన సీతారాం, రాయచూరు ప్రాంతానికి చెందిన కాలప్పతో పాటు తుఫాన్ వాహనంలో ఉన్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదం తీవ్రతకు తుఫాన్ వాహనం పూర్తిగా ధ్వంసమై నుజ్జునుజ్జయింది.

అత్యవసరంగా స్పందించిన పోలీసులు క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి (Sangareddy Government Hospital) తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆ ప్రాంత ప్రజలు ప్రమాద స్థలానికి చేరుకోవ‌డంతో రోడ్డు రవాణా తాత్కాలికంగా నిలిచిపోయినట్లు సమాచారం. అయితే పోలీసులు వాహనాలను పక్కకు తరలించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Must Read
Related News