అక్షరటుడే, బోధన్: MLA Sudarshan Reddy | బైక్పై వెళ్లే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎడపల్లి మండలం (Edapalli Mandal) దూపల్లి గేట్ వద్ద ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా రోడ్డుపై విద్యార్థులతో కలిసి వాహనదారులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
MLA Sudarshan Reddy | రోడ్డు నియమాలు పాటించాలి..
రోడ్లపై వెళ్లే వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా వాహనదారులు రోడ్డు భద్రత ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా బైక్పై హెల్మెట్ లేకుండా వెళ్తున్న వాహనదారులకు హెల్మెట్లు అందజేశారు. ప్రతిఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, ఎడపల్లి ఎస్సై రమ (Edapalli SI Rama), విద్యార్థులు పాల్గొన్నారు.