Mla Dhanpal | టూవీలర్​ మెకానిక్​లు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​

అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | టూవీలర్​ మెకానిక్​లు (Two-wheeler mechanics) ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా సూచించారు. జిల్లా కేంద్రంలో ‘టు వీలర్ మెకానిక్ అసోసియేషన్ – నిజామాబాద్’ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో బైక్​లు సురక్షితంగా కొనసాగే క్రమంలో మెకానిక్​లు చేస్తున్న కృషి అపూర్వమన్నారు. అలాగే మెకానిక్​లు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై సైతం శ్రద్ధ పెట్టాలన్నారు. రోజూ […]

అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | టూవీలర్​ మెకానిక్​లు (Two-wheeler mechanics) ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా సూచించారు. జిల్లా కేంద్రంలో ‘టు వీలర్ మెకానిక్ అసోసియేషన్ – నిజామాబాద్’ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో బైక్​లు సురక్షితంగా కొనసాగే క్రమంలో మెకానిక్​లు చేస్తున్న కృషి అపూర్వమన్నారు. అలాగే మెకానిక్​లు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై సైతం శ్రద్ధ పెట్టాలన్నారు. రోజూ గ్రీస్​, డస్ట్​ తదితర కఠిన పరిస్థితుల్లో పనిచేస్తారని.. వీరికి అవసరమైన హెల్త్ క్యాంప్​లు, జీవిత బీమా, ప్రభుత్వ ఆస్పత్రిలో నాణ్యమైన చికిత్స అందించే విధంగా అన్ని విధాలా సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు.

అర్హులైన మెకానిక్​లకు ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) వచ్చేవిధంగా అధికారులతో సమన్వయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం కొత్తగా ఎన్నికైన అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి సహా నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి పోతన్​కర్​ లక్ష్మీనారాయణ, లీగల్ అడ్వైజర్ రాజేందర్ రెడ్డి, రాష్ట్ర మెకానిక్​ అసోసియేషన్​ అధ్యక్షుడు బాబు, ఉపాధ్యక్షుడు గజ్జల మురళి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీకాంత్, బాబా, గంగారం, రామచంద్ర, గంగాధర్, బీజేపీ నాయకులు పవన్, గుండా సతీష్, బీజేపీ నాయకులు భాస్కర్, అసోసియేషన్ నాయకులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...