అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tamilnadu | తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
తెన్‌కాశీ జిల్లా (Tenkasi District)లో సోమవారం ఉదయం రెండు ప్రైవేట్ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. మధురై నుంచి సెంకోట్టైకు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు, తెన్‌కాశీ నుంచి కోవిల్పట్టి వైపు వెళ్తున్న మరొక బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 35 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Tamilnadu | అతివేగంతో..
మధురై నుంచి సెంకోట్టైకు వెళ్తున్న కీసర్ బస్సు (Keysar Bus) డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కీసర్ బస్సు డ్రైవర్ అతి వేగం, నిర్లక్ష్యంగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Tamilnadu | భయపెడుతున్న ప్రమాదాలు
ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. దీంతో ప్రజలు భయ పడుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ, ట్రావెల్స్ బస్సులు (Travels Buses) తరచూ ప్రమాదాలకు గురి అవుతండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. బస్సులు ఎక్కాలంటేనే ఆలోచిస్తున్నారు. ఏపీలోని కర్నూల్ దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాలిపోయి 19 మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. తెలంగాణలోని చేవెళ్ల వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొంది. అనంతరం సైతం పలు బస్సు ప్రమాద ఘటనలో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతుండటం గమానర్హం.
