అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chinese Manja | చైనా మాంజా వాడొద్దని పోలీసులు ఎంత చెబుతున్నా ప్రజలు వినడం లేదు. ప్రమాదకరమైన ఆ దారంతోనే పతంగులు ఎగుర వేస్తున్నారు. ఈ క్రమంలో చైనా మాంజాతో పలువురు గాయాల పాలు అవుతున్నారు.
సంక్రాంతి (Sankranthi) సందర్భంగా ఆకాశంలో గాలిపటాలు సందడి చేస్తున్నాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా పతంగులు ఎగుర వేస్తున్నారు. అయితే ఇతరుల గాలిపటాలను తెంపడాకిని యువత చైనా మాంజా వినియోగిస్తున్నారు. దీంతో మనుషులు, పక్షుల ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులు అవగాహన కల్పిస్తున్నా వినడం లేదు.
Chinese Manja | ఏఎస్సైకి గాయాలు
విధులకు వెళ్తున్న ఏఎస్సై మెడకు చైనా మాంజా చుట్టుకొని తీవ్రంగా గాయపడ్డాడు. నల్లకుంట పోలీస్ స్టేషన్ (Nallakunta Police Station)లో నాగరాజు ఏఎస్సైగా పని చేస్తున్నాడు. ఉప్పల్‌లోని తన నివాసం నుంచి బైక్‌పై డ్యూటీకి బయలు దేరాడు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తుండగా.. చైనా మాంజా మెడకు చుట్టుకొని కోసుకుపోయింది. తీవ్రంగా గాయపడ్డ ఆయనను స్థానికులు కామినేని ఆస్పత్రి (Kamineni Hospital)కి తరలించారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా (Rangareddy District) మీర్‌పేటలో చైనామాంజాతో మహిళ గాయపడింది. అల్మాస్ గూడలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు మాంజా చుట్టుకుంది. దీంతో ఆమె కాలుకు తీవ్ర గాయం కాగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
Chinese Manja | స్వీయ నియంత్రణ అవసరం
చైనా మాంజా అరికట్టడం కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పతంగుల దుకాణాల్లో తనిఖీలు చేస్తూ.. కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు. అయినా కూడా చైనా మాంజా విక్రయాలు ఆగడం లేదు. ముఖ్యంగా పతంగులు ఎగురవేసేవారి తీరులో మార్పు రావాలి. ఆ మాంజాతో తాము, తమ కుటుంబ సభ్యులు గాయపడితే ఎలా అని ఒకసారి ఆలోచించాలి. ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారిన చైనా మాంజాకు బదులుగా ఇతర దారాలతో గాలిపటాలు ఎగురవేయాలి. అలాగే తల్లిదండ్రులు సైతం పిల్లలకు చైనా మాంజా కొనివ్వదు.