69
అక్షరటుడే, ఆర్మూర్: Chinese manja | మనుషులు, పక్షులకు ప్రాణాంతకంగా మారిన చైనా మాంజాను విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ (SHO Satyanarayana Goud) వివరాలు వెల్లడించారు.
Chinese manja | పక్కా సమాచారం మేరకు..
పక్కా సమాచారం మేరకు ఆర్మూర్ నగరంలో (Armoor town) నిషేధిత చైనీస్ మాంజా విక్రయిస్తున్న షాప్ యజమాని నారాయణ, రవిలను అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని షాపు నుంచి సుమారు 18,050 విలువైన చైనీస్ మాంజాను స్వాధీనపర్చుకున్నట్లు తెలిపారు. అలాగే నిజామాబాద్‌లో (Nizamabad) హోల్‌సేల్‌గా చైనామాంజా విక్రయిస్తున్న జహీర్ ఖాన్ అనే వ్యక్తిపై సైతం క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.