అక్షరటుడే, వెబ్‌డెస్క్: Turkish Plane crashes | గగనతలంలో మరో ప్లైట్ క్రాష్ అయింది. తుర్కియేకి చెందిన సైనిక విమానం (Millitary Cargo Plane) కూలిపోయింది. ఆర్మీ C-130 కార్గో ఎయిర్ క్రాఫ్ట్ మంగళవారం (నవంబరు 11) జార్జియా(Georgia)లో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా కుప్పకూలింది.
అజర్‌బైజాన్ (Azerbaijan) నుంచి తుర్కియేకి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో సదరు విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 20 మంది ఉన్నట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. ప్రమాదంలో వీరంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు.
Turkish Plane crashes | టేకాఫ్ అయిన కాసేపటికే..
అజర్బైజాన్లో టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్ అయింది. అజర్‌బైజాన్ – జార్జియా దేశాల సరిహద్దుల్లో ఈ దుర్ఘటన జరిగిందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. సహాయక చర్య లు కొనసాగుతున్నాయన్నారు.
కాగా, ఫ్లైట్ రెక్కల నుంచి పొగలు వస్తూ గాల్లో తిరుగుతూ కుప్పకూలిన ఫ్లైట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
🔴 🇹🇷 Plane Crash
11 November 2025 – 10:50 UTC
Lockheed C-130E Hercules
Owner/operator: Türk Hava Kuvvetleri ( Turkish Air Force )
Registration: 68-1609
MSN: 4015FDamage: Destroyed
Location: near the Azerbaijan-Georgia border – Azerbaijan
Phase: En route
Nature: Military… pic.twitter.com/OyQYt7HLxw— PLANES OF LEGEND ✈️ (@PlanesOfLegend) November 11, 2025
