HomeUncategorizedBoycott Turkey | ట‌ర్కీకి చుక్క‌లే.. ఆ కంట్రీ తుప్పు రేగ్గొడుతున్న ఇండియ‌న్లు

Boycott Turkey | ట‌ర్కీకి చుక్క‌లే.. ఆ కంట్రీ తుప్పు రేగ్గొడుతున్న ఇండియ‌న్లు

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Boycott Turkey : భార‌తదేశ‌(India) శ‌త్రువు పాకిస్తాన్‌(Pakistan)కు మ‌ద్ద‌తుగా నిలిచిన ట‌ర్కీకి ఇండియ‌న్లు చుక్క‌లు చూపుతున్నారు. బ‌హిష్క‌ర‌ణాస్త్రం పేరుతో ఆ దేశ ఆర్థిక మూలాలు క‌దిలిస్తున్నారు. వ‌రుస‌గా త‌గులుతున్న షాక్‌ల‌తో స‌ద‌రు ముస్లిం దేశం విల‌విల్లాడుతోంది. ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా ఇటీవ‌ల ఇండియా ‘ఆపరేషన్ సిందూర్’ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్ర‌మూక‌ల‌ను ఏరివేసిన విష‌యం విదిత‌మే. అయితే, భార‌త్‌తో క‌య్యానికి పాకిస్తాన్ కాలు దువ్వింది. మిలిటరి మౌలిక స‌దుపాయాల‌తో పాటు పౌరుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు దిగితే వాటిని ఇండియా స‌మ‌ర్థంగా తిప్పికొట్టింది. అయితే, ఇక్క‌డే పాకిస్తాన్‌కు మ‌ద్ద‌తుగా ట‌ర్కీ నిలిచింది. ఆయుధాల స‌ర‌ఫ‌రాతో పాటు బ‌హిరంగంగానే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. దీంతో ఆ ధూర్త దేశంపై దేశ‌వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. భూకంపంతో స‌ర్వం కోల్పోయిన ట‌ర్కీకి తొలుత ఆప‌న్న‌హ‌స్తం అందించిన భార‌త్‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఇండియ‌న్లు మండిప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో బాయ్‌కాట్ ట‌ర్కీ(boycotted Turkey) అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీశారు.

Boycott Turkey : ఆర్థికంగా దెబ్బ‌కొట్టేలా..

ట‌ర్కీ తీరును వ్య‌తిరేకిస్తూ ఇప్ప‌టికే ఆలిండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ కీలక నిర్ణ‌యం తీసుకుంది. ట‌ర్కీతో అన్నిరకాల వాణిజ్య, వర్తక సంబంధాలను బాయ్‌కాట్ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ట్రావెల్, టూరిజం సహా ఆ దేశంతో అన్ని సంబంధాలను పూర్తిగా బాయ్‌కాట్ చేస్తున్నట్టు నేషనల్ ట్రేడ్ కాన్ఫరెన్స్‌(National Trade Conference)లో 125కు పైగా టాప్ ట్రేడ్ లీడర్లు నిర్ణయించారు. టర్కీతో పాటు అజర్‌బైజాన్‌(Azerbaijan)లోనూ సినిమాలు షూటింగ్ చేయవద్దని కూడా భారత చలనచిత్ర పరిశ్రమ(Indian film industry)కు ట్రేడ్ కమ్యూనిటీ విజ్ఞప్తి చేసింది. అక్కడ సినిమాలు షూట్ చేస్తే ట్రేడ్ కమ్యూనిటీతోపాటు, ప్రజలంతా ఆ చిత్రాలను బాయ్‌కాట్ చేస్తారని హెచ్చరించింది. ఆ దేశాల్లో ఉత్పత్తి ప్రమోషన్లను ఏ కార్పొరేట్ సంస్థ షూట్ చేయరాదని సైతం సదస్సులో నిర్ణయించారు. సీఏఐటీ ట్రేడ్ కాన్ఫరెన్స్‌(CAIT Trade Conference)లో పాల్గొన్న 24 రాష్ట్రాల ప్రతినిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)కి సంఘీభావం ప్ర‌క‌టించారు. భారత్‌కు వ్యతిరేకంగా నిలిచే శక్తులను వ్యతిరేకించాలని నిర్ణ‌యించారు.

Boycott Turkey : దెబ్బ మీద దెబ్బ‌..

ఇప్ప‌టికే ట‌ర్కీకి అనేక విద్యా, వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌లు షాక్ ఇచ్చాయి. ట‌ర్కీలోని వివిధ‌ యూనివ‌ర్సిటీలతో గ‌తంలో చేసుకున్న ఒప్పందాల‌ను ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు జేఎన్‌యూ, జామియా మిలియా, మౌలానా అబుల్ క‌లామ్ ఆజాద్ యూనివ‌ర్సిటీ(JNU, Jamia Millia, Maulana Abul Kalam Azad University) త‌దిత‌ర విశ్వ‌విద్యాల‌యాలు ప్ర‌క‌టించాయి. ఇక‌, ట‌ర్కీ నుంచి దిగుమ‌తి అయ్యే ఆపిల్స్‌ను కొన‌కూడ‌ద‌ని వాణిజ్య సంస్థ‌లు, ట్రేడ్ యూనియ‌న్లు నిర్ణ‌యించాయి. మ‌రోవైపు, ప్ర‌భుత్వం నుంచి కూడా ట‌ర్కీ సంస్థ‌ల‌కు దెబ్బ ప‌డింది.

ట‌ర్కీకి చెందిన సెలెబీ ఏవియేష‌న్స్‌(Celebi Aviation)కు గ‌తంలో ఇచ్చిన లైసెన్స్‌ను ర‌ద్దు చేసి ప‌డేసింది. సెలెబీ స‌బ్సిడ‌రీ కంపెనీ ద్వారా మ‌న దేశంలోని ప‌లు విమానాశ్ర‌యాల్లో స‌రుకుల ర‌వాణాతో పాటు బ‌హుళ సేవ‌లు అందిస్తోంది. దీంతో ఆ సంస్థ లైసెన్సుల‌ను రద్దు చేసింది. మ‌రోవైపు, అదానీ ఎయిర్‌పోర్టు సంస్థ కూడా సెలెబీతో ఉన్న ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకుంది. దీంతో సెలెబీ సంస్థ సేవ‌లందిస్తున్న మొత్తం 11 విమానాశ్ర‌యాల్లో సేవ‌లు నిలిపి వేయాల్సి వచ్చింది. ప్ర‌భుత్వం ఇచ్చిన షాక్‌తో సెలెబీ సంస్థ‌కు గ‌ట్టి దెబ్బ త‌గిలింది. ఇస్తాంబుల్‌లో ఆ సంస్థ షేరు ఏకంగా 10 శాతానికి పైగా కుంగింది.