అక్షరటుడే, ఇందూరు: TUCI | ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (Trade Union Centre of India) రాష్ట్ర ప్రథమ మహాసభలు ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ తెలిపారు.
శనివారం నగరంలోని కోటగల్లి ఎన్‌ఆర్ భవన్‌లో (SR Bhavan) వాల్‌పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. మహాసభల తొలిరోజు ర్యాలీ, బహిరంగ సభ ఉంటుందని, రెండోరోజు ప్రతినిధుల సభ ఉంటుందని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణపై సభల్లో చర్చ ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేందర్, సుధాకర్, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి మల్లేష్, నాయకులు సాయన్న, కిరణ్, చరణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.