అక్షరటుడే, తిరుమల: TTD : తిరుమలలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం ప్రకటించింది. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు చేసింది. వారికి ఉదయం 6 గంటల నుంచి దర్శనానికి అనుమతి ఇచ్చింది. ఇకపై ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని స్పష్టం చేసింది. మే 1 నుంచి జులై 15 వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు తెలిపింది. వేసవిరద్దీ కారణంగా సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది.
